Monday, January 6, 2025

ఆస్కార్ అకాడమీ నుంచి సూర్యకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

విలక్షణ పాత్రలతో అదరగొట్టే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య పలు హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా కమల్‌హాసన్ మూవీ ‘విక్రమ్’లో రోలెక్స్‌గా ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాకి ముందు వచ్చిన మూడు చిత్రాల్లో రెండు ఓటిటిలో విడుదలై రెండు భారీ హిట్స్‌గా నిలిచాయి. అవే జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలు. అయితే ఈ రెండు సినిమాలు కూడా ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆస్కార్ అకాడమీ నుంచి స్వయంగా సూర్యకి పిలుపు వచ్చిందట. ఈసారి జరగబోయే 2022 ఆస్కార్ అవార్డుల ఆర్గనైజర్స్ కమిటీలో 397 మందికి సభ్యత్వం ఇచ్చారు. ఆ జాబితాలో సూర్యకు కూడా చోటు దక్కడం విశేషం. అలాగే సౌత్ ఇండియన్ సినిమా నుంచి అతను ఒకడే వెళ్తున్నట్టుగా తెలిసింది. దీంతో సూర్య అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Oscar Academy invites Hero Surya

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News