జూ.ఎన్‌టిఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ఈసనిమా నుంచి ‘నాటు.. నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈసినిమాకు అస్కార్ నుంచి మరో అరుదైన గౌరవం దక్కింది. అస్కార్ అవార్డులలో మరో కొత్త కేటగిరీని జోడించారు. కొత్తగా ‘స్టంట్ డిజైన్’ అనే కేటగిరీ చేరుస్తున్నట్లు అకాడమి ప్రకటించింది. ఈ కొత్త కేటాగిరి 2027 నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘స్టంట్ డిజైన్ అనేది సినిమాలో భాగమైంది. సృజనాత్మక కళాకారులును ఈ విధంగా సత్కరించడం గర్వంగా ఉంది’ అని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ సందర్భంగా ఆస్కార్ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘ఆర్ఆర్ఆర్’, ‘మిషన్ ఇంపాజిబుల్’ స్టిల్స్‌ని జత చేసింది. అయితే స్టంట్ డిజైన్ విభాగాన్ని చేర్చడంపై రాజమౌళి స్పందించారు. 100 సంవత్సరాల నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఇది సాధ్యమయ్యేలా చేసిన నిర్వహకులకు కృతజ్ఙతలు తెలిపిన రాజమౌళి.. ఆ పోస్టర్‌పై ఆర్ఆర్ఆర్ స్టిల్ ఉండటంపై ఆనందం వ్యక్తం చేశారు.