విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ సినిమా బిగ్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు శివ నిర్వాణ రూపొందించారు. ‘ఖుషి’ సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ఐదో లిరికల్ పాట ‘ఓసి పెళ్లామా..’ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లోని ఓ పబ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ సీయీవో చెర్రీ, దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాల్గొన్నారు.
పబ్ లో పార్టీ సాంగ్ గా ఈ పాటను చిత్రీకరించారు. ‘ఓసి పెళ్లామా..’ పాటకు డైరెక్టర్ శివ నిర్వాణ లిరిక్స్ రాయగా…హేషమ్ అబ్దుల్ వాహాబ్ మరోసారి క్యాచీ ట్యూన్ అందించారు. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు. కాశ్మీర్ లో ఫస్ట్ టైమ్ తనను చూసిన, ముందెనక చూడకుండ మనసిచ్చిన…బాబు మాట పక్కనెట్టి బయటకొచ్చిన, లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసిన…అంటూ హీరో తన ప్రేమ, పెళ్లి ప్లాష్ బ్యాక్ గురించి చెబుతూ సాగుతుందీ పాట. ఈ పాట విడుదల కార్యక్రమంలో
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ – ఈ సాంగ్ రిలీజ్ లో పాల్గొనేందుకు వచ్చిన అందరికీ వెల్ కమ్. ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన మైత్రీ రవి గారికి, సంగీత దర్శకుడు హేషమ్ గారికి, డైరెక్టర్ శివ గారికి థాంక్స్. ఫస్ట్ టైమ్ విజయ్ అన్నకు నేను పాడిన పాట ఇది. బ్యూటిఫుల్ సాంగ్ ఇది. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – మిగతా అందరి కంటే ప్రొడ్యూసర్స్ గా మేము ఈ సినిమా కోసం ఉత్సాహంగా వేచి చూస్తున్నాం. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఖుషి మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. అన్నారు
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ – నా సినిమా థియేటర్ లో రిలీజై రెండేళ్లు దాటుతోంది. మళ్లీ మీ అందరినీ ఓ మంచి ఎంటర్ టైనర్ తో కలుస్తుండటం సంతోషంగా ఉంది. ఖుషిలో మంచి ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ ఉంటాయి. మీరు మీ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడొచ్చు. మీరు రీపీటెడ్ గా సినిమాను చూస్తారు. అంత బాగుంటుంది. ఫన్ రైడ్ లా సినిమా ఉంటుంది. చాలా రోజుల తర్వాత సమంత లవ్ స్టోరీలో నటిస్తుందంటే మనందరికీ పండగ. ఇవాళ ఈ స్టేజీ మీద విజయ్ ను, సమంతను మిస్ అవుతున్నా. హేషమ్ బ్రో మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన రవి గారికి, నవీన్ గారికి థాంక్స్. అన్నారు.
సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ మాట్లాడుతూ – ఖుషి సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చేందుకు మైత్రీ సంస్థ , డైరెక్టర్ శివ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ నెల ఒకటో తేదీన మేము ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేశాం. ఇవాళ కంప్లీట్ చేశాం. ఈ సినిమాకు పనిచేసేందుకు ఎంతో సపోర్ట్ చేశారు మైత్రీ ప్రొడ్యూసర్స్. ఖుషి థియేటర్ లో బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇస్తుంది. తప్పకుండా చూడండి. అన్నారు.
మైత్రీ సీయీవో చెర్రీ మాట్లాడుతూ – ఎన్నో జానర్స్ మూవీస్ చూస్తూ ఉన్నారు. కానీ ఈ మధ్య ఒక ఫుల్ ప్లెజ్డ్ లవ్ స్టోరీ రాలేదు. ఖుషిలో అలాంటి మంచి ప్రేమ కథను అన్ని ఎమోషన్స్ కలిపి చూస్తారు. దర్శకుడు శివ గారు మంచి సినిమా చేశారు. సెప్టెంబర్ 1న ఖుషిని థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.