Thursday, November 14, 2024

జంట జలాశయాలకు భారీగా వరద…

- Advertisement -
- Advertisement -

Osman Sagar 06 Gates lifted

ఉస్మాన్‌సాగర్ 06 గేట్లు ఎత్తివేత
హిమాయత్‌సాగర్ 10 గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సహాయక చర్యల కోసం అధికారులను సన్నద్దం చేసిన ఎండీ దానకిషోర్

మన తెలంగాణ, హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలశయాలు నిండుకుండల్లా మారాయి. రెండు జలశయాలనకు భారీగా వరదనీరు చేరుతుండటంతో పూర్తి స్దాయి నీటి మట్టానికి చేరాయి. దీంతో మంగళవారం సాయంత్రం 6గంటలకు ఉస్మాన్‌సాగర్ 06 గేట్లు, హిమాయత్‌సాగర్ 10 గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలు వదలుతున్నాయి.

ఉస్మాన్ సాగర్ : రెండు రోజుల కితం వరకు ఉస్మాన్‌సాగర్ 4 గేట్లను 2 పీట్ల వరకు ఎత్తి నీటిని వదులుతుండగా, ఇవాళ ఉదయం 8గంటలకు 4 గేట్లును 2 పీట్ల నుంచి 3 ఫీట్ల వరకు తెరిచారు. అలాగే మధ్యాహ్నం 3గంటలకు మరో 2 గేట్లను 3 పీట్ల ఎత్తుకు తెరిచి మొత్తం 6 గేట్ల నుంచి 2100 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదిలారు.

హిమాయత్‌సాగర్ : మొన్నవరకు ఒక గేట్లు ద్వారా నీటిని వదలగా, ప్రస్తుతం మొత్తం 12 గేట్ల ద్వారా మూసీనదిలోకి నీటిని వదులుతున్నారు. మద్యాహ్నం 3గంటలకు తెరిచి ఉన్న 10 గేట్లలో రెండు గేట్లను 2 ఫీట్ల నుంచి 3 పీట్ల ఎత్తుకు తెరిచి మొత్తం 7700 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు అధికారులు వదులుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి : జలమండలి ఎండీ దానకిషోర్
జంట జలాశయాల నుంచి మూసీనదిలోకి బారీగా వరద నీటిని వదులుతున్నందున ఎండీ దానకిషోర్ సంబందిత అధికారులను అప్రమత్తం చేశారు. జలాశాయాల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, మురికివాడ ప్రాంతాలు, మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్దితులనైనా ఎదుర్కొవడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్దం కావాలని హైదరాబాద్, రంగారెడ్డిజిల్లాల పరిపాలన యంత్రాంగంతో పాటు జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు.

ఉస్మాన్‌సాగర్ నీటిస్దాయి ప్రస్తుతం 1790 అడుగులకు చేరగా, నీటి సామర్దం 3.900 టిఎంసీలు ఉన్నట్లు, ఇన్‌ప్లో 2వేల క్యూసెక్కులు, అవుట్‌ప్లో 2100 క్యూసెక్కులు మొత్తం గేట్లు సంఖ్య 15 ఉండగా, 06 గేట్లు 3 ఫీట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతున్నారు. అదే విధంగా హిమాయత్‌సాగర్ పూర్తిగా 1763.50 అడుగులకు చేరుకుని 2.968 టీఎంసీలు సామర్దం నీరు ఉందని, ఇన్‌ప్లో 5వేల క్యూసెక్కులు, అవుట్‌ప్లో 7700 క్యూసెక్కులు రావడంతో 10 గేట్లు తెరిచి మూసీలోకి వరద జలాలు వదులుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News