Saturday, January 18, 2025

ఎఫ్‌టిఎల్‌నే మార్చేశారు

- Advertisement -
- Advertisement -

ఉస్మాన్‌సాగర్‌లో నీటిపారుదలశాఖ
అధికారుల నిర్వాకం గుర్తించిన
హైడ్రా ముగ్గురు అధికారులపై
చర్యలకు సిఫారసు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: హైదరాబాద్ మహానగర శివారులోని జంటజలాశయాలలో ఒకటైన ఉస్మాన్ సాగర్ ఎఫ్‌టిఎల్ నివేదికలను తారుమారు చేసినందుకు నీటిపారుదల అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ సిఫారస్ చేసినట్టు తెలిసింది. ఉస్మాన్ సాగర్ జలాశయం పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్)  నివేదికలను గుర్తించడంలో అవకతవకలు చేసినందుకు నీటిపారుదల శాఖ సీనియర్ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం పెద్ద పెనాల్టీ ప్రక్రియను ప్రారంభించినట్టు సమాచారం.

హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చేసిన సిఫార్సు మేరకు ఇరిగేషన్ శాఖకు పురపాలక శాఖ సూచించినట్టు తెలిపింది. వివరాల్లోకి వెళ్ళితే.. 2015లో, ఉస్మాన్ సాగర్ సరస్సులోని ఎఫ్‌టిఎల్ జోన్ పరిధిలోని నిర్మాణాలను గుర్తించడానికి, ధృవీకరించడానికి జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. కమిటీలో నీటిపారుదల శాఖ, హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్‌బీ, రెవెన్యూ శాఖ అధికారులు ఉన్నారు.

ముగ్గురు అధికారులపై…

రెడ్ హిల్స్‌లోని నీటిపారుదల విభాగానికి చెందిన ఎస్‌ఈ టి. వెంకటేశం, ఈఈ భీమ్ ప్రసాద్, నార్త్ ట్యాంక్ డివిజన్, హైదరాబాద్‌కు చెందిన ఈఈ వై. శేకర్ రెడ్డిలు ఉస్మాన్‌సాగర్ ఎఫ్‌టిఎల్ హద్దులు ఖరారు చేయడంలో కొంత అవకతవకలకు పాల్పడినట్టు హైడ్రా గుర్తించి మునిసిపల్ విభాగానికి తెలిపింది. దీంతో ఇరిగేషన్ విభాగానికి మునిసిపల్ శాఖ ఉత్తర్వులిస్తూ ఆ ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్టు అధికార వర్గాల సమాచారం.

అధికారులపై పెద్ద పెనాల్టీ ప్రొసీడింగ్‌లను ప్రారంభించాలని, వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి విచారణ నిర్వహించాలని మునిసిపల్ విభాగం ఆదేశించింది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్ తన ఉత్తర్వులలో, జవాబుదారీతనం, ఎఫ్‌టిఎల్ సరిహద్దులను తారుమారు చేస్తూ అక్రమ నిర్మాణాలకు వెసులుబాటు కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించరనేది సమాచారం.

హైడ్రా సిఫార్సు..

ఉస్మాన్‌సాగర్ జలాశయాన్ని సమగ్ర తనిఖీ, విచారణలో జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీ నివేదికలో గణనీయమైన వ్యత్యాసాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించినట్టు, అందుకు చర్యలు తీసుకోవాలని అభ్యర్థించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఉస్మాన్ సాగర్ సరస్సుకు సంబంధించిన పర్యావరణ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఎఫ్‌టిఎల్ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చారని హైడ్రా భావించిందని సమాచారం. ఒక తనిఖీ కమిటీ నివేదికలో తప్పుగా సూచించిన నిర్ధారణల ఆధారంగా. జాయింట్ ఇన్‌స్పెక్షన్ కమిటీలోని ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు వెల్లడిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News