Monday, November 18, 2024

ఉస్మాన్‌సాగర్ గేట్లు మూసివేత

- Advertisement -
- Advertisement -

హిమాయత్‌సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ప్లో
నిండుకుండల్లా జంట జలాశయాలు

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెరిచిన ఉస్మాన్‌సాగర్ జలాశయం గేట్లను వరద ఉధృతి తగ్గడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్‌సాగర్ జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరగడంతో ఈనెల 4వ తేదీన నాలుగు గేట్లను ఎత్తివేసి మూసీనదిలోకి వదలారు. అయితే గత వారం రోజులుగా వర్షాలు తగ్గడంతో జలశయానికి వరద ప్రవాహం కూడా తగ్గింది. దీంతో జలాశయానికి వరద నీటి ప్రవాహం తగ్గుతున్నా కొద్ది ఒక్కో గేటును మూసివేసిన అధికారులు ,గురువారం చివరి గేటను కూడా రిజర్వాయర్ నీటి మట్టం 1788.75 అడుగుల వద్ద మూసివేశారు. ఈఏడాది రెండుసార్లు ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదలారు. మొదటిసారి జూలై 22న గేట్లు తెరిచి వరద ఉధృతి తగ్గడంతో 25న మూసివేశారు. రెండోసారి సెప్టెంబర్ 4న గేట్లు తెరిచి ప్రస్తుతం మూసివేశారు.
హిమాయత్‌సాగర్‌కు కొనసాగుతున్న ఇన్‌ప్లో: హిమాయత్‌సాగర్ ఇప్పటికి స్వల్పంగా వరద నీరు చేరుతున్నందున ఒక గేటు ద్వారా 350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలుతున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తి స్దాయి నీటి మట్టం ః 1763.50 అడుగులు, ప్రస్తుత నీటి స్దాయి 1762.50 అడుగులు, నీటి సామర్దం 2.697 టిఎంసీలు, ఇన్‌ప్లో 500 క్యూసెక్కులు, అవుట్‌ప్లో 350 క్యూసెక్కులు, మొత్తం గేట్లు 17, ఎత్తిన గేట్లు సంఖ్య ఒక గేటు….
ఉస్మాన్‌సాగర్ ః పూర్తిస్దాయి నీటి మట్టం 1790 అడుగులు, ప్రస్తుత నీటి స్దాయి 1788.75 అడుగులు, రిజర్వాయర్ ప్రస్తుత సామర్దం 3.614 టిఎంసీలు, ఇన్‌ప్లో 0 క్యూసెక్కులు, మొత్తం గేట్లు 15 ఉండగా, ప్రస్తుతం అన్ని మూసివేత….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News