Monday, December 23, 2024

హోల్ చైల్ డెవలప్‌మెంట్ కోర్సుల దిశగా ఓయూ

- Advertisement -
- Advertisement -
అమెరికా నోట్రే డామ్ విశ్వవిద్యాలయం అధ్యాపకులతో చర్చలు

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం బి.ఎడ్ విద్యార్థుల కోసం హోల్ చైల్ డెవలప్‌మెంట్ కోర్సును అందించేందుకు అమెరికాలోని నోట్రే డామ్ విశ్వ విద్యాలయ అధ్యాపకుల బృందం ఓయూ అధ్యాపకుల బృందంతో చర్చలు జరిపింది. గురువారం నోట్రే డేమ్ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు, అసోసిటేయ్ ప్రొవోస్ట్ మైఖేల్ పిప్పెంగర్ నాయకత్వంలోని విద్యార్థుల సమగ్రాభివృద్ధి అంతర్జాతీయ కేంద్రం ప్రతినిధి బృందం ఓయూతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకునేందుకు ప్రతిపాదించింది. ఇండియా ఇంటర్వెన్షన్స్ డైరెక్టర్ ధీరజ్ మెహ్రా, రుబీనా పాల్గొన్నారు. ఓయూ ప్రతినిధి బృందానికి ఉపకులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ నాయకత్వం వహించారు.

యూనివర్శిటీ ఆఫ్ నోట్రే డామ్ ఫ్యాకల్టీ, హైదరాబాద్‌లోని ఇన్-పర్సన్ టీమ్ ద్వారా తరగతులు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించాలని సమావేశంలో అంగీకరించారు. తరగతి గదిలో సంపూర్ణ శిశు అభివృద్ధి నమూనాల ఏకీకరణ రాష్ట్రంలోని భవిష్యత్తు విద్యావేత్తలకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇరు పక్షాలు అభిప్రాయపడ్డాయి. ఈ భాగస్వామ్యం భారతదేశ విద్యా వ్యవస్థను మార్చడానికి పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని చెప్పారు. ఎంతో మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు సాధ్యమయ్యే మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుని పరిచయం చేయడంతో పాటుగా ఒక ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి భవిష్యత్తులో సహకారాన్ని కలిగి ఉండాలని ఆశిస్తున్నట్లు ఓయూ, నోట్రేడామ్ విశ్వవిద్యాలయ అధ్యాపకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

యూనివర్శిటీ ఆఫ్ నోట్రే డామ్‌తో సహకారంపై ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు. మాడ్యూల్స్‌కు అనుసరించాల్సిన మూల్యాంకన విధానం కోర్సు వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ పేర్కొన్నారు. నోట్రే డామ్ విశ్వవిద్యాలయంలోని గ్లోబల్ సెంటర్ ఫర్ ది హోల్ చైల్ చేస్తున్న కృషి, కార్యక్రమాలను ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మీనారాయణ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News