Saturday, December 21, 2024

860 మంది విద్యార్థులకు 16 మంది ఉత్తీర్ణత…. విద్యార్థుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉస్మానియా బిఎస్ సి అలైడ్ సైన్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాళోజీ యూనివర్సిటీలో 860మంది విద్యార్థులలో 16 మంది విద్యార్థులు మాత్రమే ఉతీర్ణత సాధించారు. బిఎస్సి అలైడ్ సైన్స్ విద్యార్థి జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాళోజీ యూనివర్సిటీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాళోజీ యూనివర్సిటీలో విద్యార్థులకు లైబ్రరీ, హాస్టల్ వసతి, సరైన టీచింగ్ సిబ్బంది లేకపోవడం విద్యార్థులు పరీక్షల్లో విఫలమవుతున్నారన్నారు. కాలేజీ గ్రౌండ్ లోకి విద్యార్థులకు అనుమతిచ్చడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఫెయిల్ అయిన 844 మంది విద్యార్థులకు న్యాయం చేయాలని, గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిఎస్సి అలైడ్ సైన్స్ కోర్సుల్లో ప్రభుత్వం వసతులు కల్పించాలని, తగిన వసతులు లేక విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, 50 శాతం ఉన్న పాస్ మార్కుల శాతాన్ని  40శాతానికి తగ్గించి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News