Monday, January 20, 2025

ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు

- Advertisement -
- Advertisement -

గోషామహల్: శతాబ్దానికి పైగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి ప్రపంచ వ్యా ప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు ఉందని రాష్ట్ర హోంశాఖా మంత్రి మహ్మద్ మహమూద్ అలీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఓపీ బ్లాక్‌లో ట్రాన్స్‌జెండర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ క్లినిక్, పెయిన్ క్లినిక్‌లను ఆయన ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శశికళా రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమీషనర్ భారతి హోలికేరి, జిహెచ్‌ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శంకర్‌యాదవ్‌లతో కలిసి ప్రారం భించి, రక్తపోటు ప రీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని జి హెచ్‌ఎంసి కాంప్లెక్స్‌లోని 3వ అంతస్తులో ఆధునీకరించి న సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆపరేషన్ థియేటర్‌ను ప్రా రంభించి, అక్కడ రోగులకు నిర్వహించే శస్త్ర చికిత్సలు, కిడ్ని, లివర్ మార్పిడి శస్త్ర చికిత్సల గురించి వైద్యులను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం సూపరింటెండెంట్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హోంశాఖా మంత్రి మహమూద్ అ లీ వైద్యాధికారులతో కలిసి మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సిఎం కెసిఆర్ వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత కల్పించారని అన్నా రు. నగర శివార్లలో 4 అత్యాధునిక వైద్య కళాశాల లకు శంఖుస్థాపన చేశారని చె ప్పారు. వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు వందల కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. 105 సంవత్సరాల చారిత్రాత్మక ఉ స్మానియా ఆసుపత్రి శిథిలావస్థకు చేరిందని తెలుసుకుని, సిఎం కెసిఆర్ స్వయంగా ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారని గుర్తు చేశారు. ఆసుపత్రి భవనం వారసత్వ సంపద జాబితాలో ఉండటం, ఈ విషయమై న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండటంతో ఉస్మాని యా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుందన్నారు.

ఎన్నికలకు ముందే ఉస్మానియా ఆసుపత్రి నూ తన భవన నిర్మాణం జరుగు తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో నిష్ణాతులై న వైద్యుల బృందం, సిబ్బంది సమన్వయంతో పేద రోగులకు సకా లంలో మెరుగైన వైద్యసేవలు అందిస్తుండటం అభినందనీయమని అన్నారు. 1963 సంవత్సరంలో తన చిన్నతనంలో అంటే సుమారు 7 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు కింద పడటంతో చేతికి ప్రాక్చర్ అయ్యిందని, అయితే తన తండ్రి చేతికి కట్టు కట్టించినా, నయం కాక పోవడంతో వైద్యుల సూచనల మేరకు కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించారని, ఇక్కడే శస్త్రచికిత్స చేయించుకుని, 2 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉన్నానని హోంశాఖా మంత్రి మహమూద్ అలీ తన చిన్ననాటి జ్ఞా పకాలను గుర్తు చేసుకున్నారు.

ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి నాగేందర్ మాట్లాడుతూ రో గుల సౌకర్యార్దం జిహెచ్‌ఎంసి కాంప్లెక్స్‌లోని 3 వ అంతస్తులో రూ. 75 లక్షల వ్యయంతో ఆధునీకరించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాల జీ ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శా ఖా మంతి హరీష్‌రావు, వైద్యాధికారులు అందిస్తున్న ప్రో త్సాహం, సహకారంతో ఉస్మానియా ఆసుపత్రిలో మూత్ర పిండాలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మోకాళ్ల కీళ్ల మా ర్పి డి, తుంటి ఎముక శస్త్ర చికిత్స వంటి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం ప్రభుత్వ సహకారంలో పూర్తి ఉచితంగా చేస్తుండటంతో పొరుగు రాష్ట్రాల నుండి రోగులు ఉస్మానియా ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ బి త్రి వేణి, సివిల్ సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ బి శేషాద్రి, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంవోలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ బండారి శ్రీనివాసులు, అనస్థీషియా వి భాగాధిపతి డాక్టర్ పాండునాయక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్ట ర్ మధుసూదన్, ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ రా కేష్ సహా య్‌తో పాటు ఆర్‌ఎంవోలు డాక్టర్ మహ్మద్ ర ఫీ, డాక్టర్ సుష్మ, డాక్టర్ అనురాధ, డాక్టర్ మాధవి, డా క్ట ర్ కవిత, డాక్టర్ జాఫర్ హష్మి, నర్సింగ్ సూపరిం టెం డెంట్ సుజాత రాథోడ్‌లతో పాటు వైద్యులు, సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News