Wednesday, January 22, 2025

23 న ఉస్మానియా ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ , యువకులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 23 వతేదీన ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇంఫార్మేషన్, గైడెన్స్ బ్యూరో డిప్యూటీ చీఫ్ అధికారి టి. రాము తెలిపారు. ఐ.టి.ఐ డీజిల్ మెకానిక్ , డిప్లొమా మెకానికల్ , డిగ్రీ, పీజీ, బీటెక్ పూర్తి చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని పేర్కొన్నారు. హైదరాబాద్ మిత్ర ఏజెన్సీస్ సహకారంతో నిర్వహించే ఈ జాబ్ మేళాకు సెప్టెంబర్ 23 న ఉదయం 11గంటలకల్లా హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 77998 84909 నెంబరులో సంప్రదించవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News