Sunday, December 22, 2024

ఉస్మాన్‌సాగ‌ర్ రెండు గేట్లు ఎత్తివేత‌

- Advertisement -
- Advertisement -

భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గండిపేట‌ ఉస్మాన్‌సాగ‌ర్‌ జ‌లాశయానికి వ‌రద నీరు భారీగా చేరుతోంది. ఇప్పటికే జలాశయంలో నీరు గరిష్ట స్థాయికి చేరుకుంది.దీంతో నిండుకుండలా మారింది. ఈ నేపథ్యమంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఉస్మాన్‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ రెండు గేట్ల‌ను ఒక ఫీటు మేర ఎత్తి 234 క్యూసెక్కుల నీటిని మూసీ న‌దిలోకి నీటిని వ‌ద‌ల‌ుతున్నారు. ఈ సంద‌ర్భంగా మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల ప‌ట్ల‌ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వివిధ శాఖల అధికారుల‌కు జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News