- Advertisement -
బెంగళూరు: మసీదులను కూల్చి ఆలయాలు నిర్మిస్తామంటూ కర్నాటక మాజీ ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలోని హవేరీ జిల్లాలో బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ముఘల్ రాజుల కాలంలో ఆలయాలను కూల్చి మసీదులను నిర్మించారని, తాము ఆ మసీదులను కూల్చి ఆ ప్రదేశంలోనే ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు.
అయోధ్యలో ఏమి జరిగిందో కాశీ విశ్వనాథుని ఆలయంలో కూడా జరుగుతుందని, త్వరలో కోర్టు సర్వే నివేదిక వచ్చిన తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంతోపాటు మథురలోని శ్రీకృష్ణ ఆలయంలో కూడా అయోధ్య పరిస్థితినే చూస్తామని ఆయన చెప్పారు. కొత్త సమీదులను తాము కూల్చబోమని ఆయన స్పష్టం చేశారు. ఆలయాను కూల్చి మసీదులను నిర్మించిన చోటే మళ్లీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు. ఇది ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో..50 ఏళ్ల తర్వాతైనా జరిగి తీరుతుందని ఆయన చెప్పారు.
- Advertisement -