Wednesday, January 22, 2025

ఒక్కొక్కరి అడుగు గులాబీవైపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఉప్పల్ : రోజులు దగ్గరపడుతున్నాయి..ఇంకా మిగిలింది 35 రోజులే..గులాబీ అభ్యర్థి ఎత్తులకు ప్రతిపక్షాలు తేరుకోలేని పరిస్థితి.. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడిని ఇద్దరు కీలక నేతలు కారు గూటికి చేరారు. ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి గెలుపు కోసం ప్రచారం హోరేత్తిస్తున్నారు.. మరోవైపు భారతీయ జనతాపార్టీ నేటికి అభ్యర్థిని ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌కు మరోసారి కమలం అభ్యర్థిగా ప్రకటించొద్దని సొంతపార్టీ నేతలే అడ్డుస్తున్నారు. అంతేగాకుండా తాజాగా జనసేనబీజేపీ మధ్య పొ త్తులలో భాగంగా ఉప్పల్ టిక్కెట్ జనసేన ఆశిస్తుంది. ప్రతిపక్షాలు ఆలోచిస్తుంటే గులాబీ అభ్యర్థి మాత్రం ప్రచారంలో జోష్ పెంచి నియోజకవర్గ నేతలందరినీ రా జకీయాలకు అతీతంగా గులాబీ గూటికి తీసుకొచ్చే పనిలో ఉన్నారు.

హస్తం ప్రచారంలో అభ్యర్థి వెనుకంజ…
ఉప్పల్ హస్తం పార్టీ అభ్యర్థి మందముల పరమేశ్వరరెడ్డి కష్టపడి టిక్కెట్ అయితే సాధించారు. కానీ రోజుకో నేత పార్టీ వీడి గులాబీ గూటికి చేరేవారిని కట్టడి చేయడంలో విఫలం చెందుతున్నారు. ప్రచారంలో వెనుకంజలో ఉండిపోయారని సొం తపార్టీ నేతలు బహటంగా వాపోతున్న పరిస్థితి నెలకొంది. గడిచిన ఎన్నికల్లో రెం డోస్థానంలో ఉన్న పార్టీ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫలితాలను ఊ హించుకోవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూ పు విభేదాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని కాపాడుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందడంతో రోజురోజుకు పార్టీ బలహీ న పడుతూ వస్తుంది.

సామాజిక మాధ్యమాల్లోనే భాజపా…
క్షేత్రస్థాయిల్లో ప్రజల్లో ఉండాల్సిన భారతీయ జనతాపార్టీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేయడానికి సమయం కేటాయిస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించకపోవడంతో టిక్కెట్ ఆశిస్తున్న ముగ్గురు నేతలు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. అంతేగాకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెడ్డి సామాజిక వర్గానికి టిక్కెట్ కేటాయించడంతో భాజపా బీసీ వర్గానికి టిక్కెట్ కేటాయించాలని పట్డుబడుతున్నారు. మరోవైపు జనసేన ఉప్పల్ టిక్కెట్ కావాలని ప్రతిపాదన పెట్టడంతో భాజపా ఇరుకున పడింది. ఉప్పల్ నియోజకవర్గంలో కారు స్పీడ్‌కు తిరుగులేదని ప్రజలే బహిరంగంగా ప్రకటించే పరిస్థితి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News