Monday, January 20, 2025

రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరుందుకున్నాయి. హైదరాబాద్ లో గురువారం బీజేపీ ఎంపీటీసీ, మాజీ కౌన్సిలర్లు, ఆదిలాబాద్ ,ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆరెస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ కు బిఆర్ఎస్ చేసిందేం లేదన్నారు. ఆదిలాబాద్ జిల్లాను కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకుంటుందన్న రేవంత్ ఆదిలాబాద్ జిల్లాలో గృహనిర్మాణ శాఖ మంత్రి ఉన్నా ఆదిలాబాద్ ప్రజలకు ఇల్లు రాలేదని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ లో ఉన్న ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించండని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News