Sunday, December 22, 2024

పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరికలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనలో భారీగా చేరికలు జరిగాయి. పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని చెప్పారు. తన గెలుపుకోసమే పిఠాపురం నుంచి పోటీ చేయట్లేదని పవన్ తెలిపారు. గాజువాక, భీమవరంతో పాటు పిఠాపురం కూడా తనకు ముఖ్యమే అన్నారు.

పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎక్కువ మంది కోరారన్నారు. తనను అసెంబ్లీకి పంపిస్తామని చాలామంది హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇక నుంచి పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటానని పవన్ పేర్కొన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 2019లో పిఠాపురం నుంచి పోటీ చేయమంటే ఆలోచించా. పిఠాపురాన్ని ఒక నియోజకవర్గంగా చూడలేదు. పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం అని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News