Sunday, December 22, 2024

ఓటిపిల దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

OTP theft arrested in hyderabad

పిటి వారెంట్‌పై తీసుకువచ్చిన నగర సైబర్ క్రైం పోలీసులు

హైదరాబాద్: ఓటిపి పేరుతో పలువురు అమాయకుల బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు దోచుకున్న సైబర్ నేరస్థుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం గిరిడ్ జిల్లాకు చెందిన నీరజ్ శర్మ(26) సైబర్ నేరాల్లో ఆరితేరాడు. ఎస్‌బిఐ బ్యాంక్ ఖాతాదారుల ఫోన్లకు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సస్పెండెడ్ అని మెసేజ్ పంపిస్తున్నాడు. కిందిత లింక్ ద్వారా వివారాలు అప్‌డేట్ చేసుకోవాలని కోరుతున్నాడు. నిందితుడు పంపించిన మెసేజ్‌కు స్పందించిన బాధితులను నిలువునా దోచుకుంటున్నాడు. నిందితుడు పంపించిన లింక్ ఖాతాదారుడు కెవైసి అనుకుని నింపడంతో వారికి ఓటిపి పంపిస్తున్నాడు. ఓటిపిని ఎంటర్ చేయడంతో నిందితుడికి బ్యాంక్ ఖాతాదారుడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుల వివారాలు నిందితుడికి మొత్తం తెలుస్తున్నాయి. వాటిని నీరజ్ శర్మ తన బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాడు. నిందితుడిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. జార్ఖండ్ పోలీసులు ఓటిపి నిందితుడిని అరెస్టు చేయడంతో నగర పోలీసులు పిటి వారెంట్‌పై తీసుకుని వచ్చారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News