Tuesday, January 21, 2025

నీతి ఆయోగ్‌ కోసం నేషనల్‌ డాటా-ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి..

- Advertisement -
- Advertisement -

OTSI Develops National Data & Analytics Platform for NITI Aayog

హైదరాబాద్‌: ఐటీ, కన్సల్టింగ్‌ సేవలలో అంతర్జాతీయంగా అగ్రగామి సంస్ధ ఆబ్జెక్ట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఓటీఎస్‌ఐ) ఇప్పుడు నీతిఆయోగ్‌ యొక్క ప్రతిష్టాత్మక నేషనల్‌ డాటా, ఎనలిటిక్స్‌ ప్లాట్‌ఫామ్‌ (ఎన్‌డీఏపీ)ను అభివృద్ధి చేసింది. దీనిని గత వారం విడుదల చేశారు. ఓటీఎస్‌ఐను సాంకేతిక భాగస్వామిగా ఎంపిక చేశారు. ఈ పోర్టల్‌ ప్రజలు, విధాన నిర్ణేతలు, విద్యావేత్తలు, పరిశోధకులు, ఇనిస్టిట్యూషన్‌, అంతర్జాతీయ సంస్థలు మొదలైన వాటికి సహాయపడటంతో పాటుగా పలు శాఖల వ్యాప్తంగా సమాచారాన్ని అతి సులభంగా విశ్లేషించేందుకు తగిన అవకాశాలనూ కల్పిస్తుంది. ఈ పోర్టల్‌ ప్రస్తుతం 203 డాటా సెట్లను 47కుపైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల నుంచి అందిస్తుంది. ఈ సమాచారం 14 రంగాలలో అందుబాటులో ఉండటంతో పాటుగా భవిష్యత్‌లో గ్రామ స్ధాయి డాటాను కూడా అందించే రీతిలో తీర్చిదిద్దనున్నారు.

ఈ పోర్టల్‌పై లభ్యమయ్యే డాటా సెట్స్‌ను వినియోగ అంశాలు ఆధారంగా, నిపుణులతో చర్చించిన తరువాత అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదాహరణకు జనాభా లెక్కలు, కుటుంబ ఆరోగ్య సర్వే, ఏకీకృత జిల్లా స్ధాయి సమాచార వ్యవస్ధ, విద్యా సమచారం మొదలైనవి ఈ పోర్టల్‌పై అందుబాటులో ఉంటాయి. ‘‘ప్రత్యేకంగా తీర్చిదిద్దిన అల్గారిథమ్స్‌ వినియోగించి పలు ప్రభుత్వ శాఖల నుంచి పొందిన సమాచారం పొందవచ్చు. తద్వారా రెండు విభిన్నమైన డాటా సెట్స్‌ను సరిపోల్చవచ్చు. అంటే దీనర్థం, వినియోగదారులకు అనుకూల రూపంలో ప్రభుత్వ సమాచారం లభిస్తుంది. ఇప్పటి వరకూ 30వేలకు పైగా సోర్స్‌ ఫైల్స్‌ను పలు శాఖల నుంచి ప్రాసెస్‌ చేయడంతో పాటుగా వాటిని ఎన్‌డీఏపీపై 203 డాటా సెట్ల తో మిళితం చేశాం. రాబోయే కొద్దివారాలలో మరిన్ని డాటా సెట్లను పొందేందుకు కృషి చేస్తున్నాము’’అని చంద్ర తాళ్లూరి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఓటీఎస్‌ఐ అన్నారు.

OTSI Develops National Data & Analytics Platform for NITI Aayog

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News