Monday, December 23, 2024

ఒయు, జెఎన్‌టియు పరీక్షలు వాయిదా..

- Advertisement -
- Advertisement -

TET examination across Telangana

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథయలో సోమ, మంగళ, బుధవారాలు మూడు రోజులపాటు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ మూడు రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేస్తూ ఆయా ఒయు నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 నుంచి జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. అలాగే జెఎన్‌టియుహెచ్‌లో ఈ నెల 11, 12 తేదీలలో జరగాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఈ నెల 16 నుంచి జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం యథావిధిగా జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది.

OU and JNTU Exams postponed due to Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News