Thursday, January 23, 2025

ఓయూ బ్యాక్‌లాగ్ పరీక్షల తేదీలు ప్రకటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఎంఏ ఆర్ట్, సోషల్ సైన్సు సెమిస్టర్ 1,2 ఒకేసారి అవకాశంతో బ్యాక్‌లాగ్ 2000-2017 బ్యాచీలకు జూన్ నుంచి పరీక్షల నిర్వహిస్తున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం పేర్కొంది. పరీక్షలు జూన్ 17వ తేదీ నుంచి 23వ తేదీవరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అదే విధంగా సెమిస్టర్ 3, 4లు జూన్ 13 నుంచి 21వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఉంటుందని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వెల్లడించింది.

ఎంకామ్, ఎంఎఫ్‌సి పరీక్షలు సెమిస్టర్ 1,2లు జూన్ 13 నుంచి 21వ తేదీవరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు, మూడో సెమిస్టర్ పరీక్షలు జూన్ 22 తేదీవరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎంఎస్సీ మొదటి సెమిస్టర్ జూన్ 13 నుంచి 22 వరకు ఉంటుందని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News