Thursday, January 23, 2025

ఓయూ పిహెచ్‌డీ సీట్ల కేటాయింపుపై నివేదిక సమర్పించిన కమిటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  పి.హెచ్.డి ప్రవేశాల్లో సీట్ల కేటాయింపుపై పలువురు విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలపై ఉస్మానియా విశ్వవిద్యాలయం వేసిన సీనియర్ ప్రొఫెసర్ ఎం కుమార్, ప్రొఫెసర్ స్టీవెన్ సన్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను సమర్పించింది. శనివారం జరిగిన యూనివర్శిటీ స్థాయీ సంఘ సమావేశంలో పలు సిఫార్సులు చేస్తూ నివేదిక వివరాలను వెల్లడించింది.

విద్యార్థుల భవిష్యత్తు దృష్టా యుద్ద ప్రాతిపదికన ఐదు సార్లు సమావేశమైన కమిటీ రాజనీతి శాస్త్ర విభాగంలో పీహెచ్‌డి సీట్ల కేటాయింపులో జరిగిన తప్పును సరిదిద్దుతూ చేసిన నూతన కేటాయింపుల జాబితాను విడుదల చేసింది. ఆయా విభాగాల డీఆర్సీలు, డీన్ నేతృత్వంలో జరిగే పీహెచ్‌డీ సీట్ల కేటాయింపు విషయంలో ఉపకులపతి, పరిపాలనా విభాగంపై పలువురు చేసిన ఆరోపణలను కమిటీ తీవ్రంగా తప్పుబట్టింది. భవిష్యత్తులో ఆయా విభాగాల డీఆర్సీలు, డీన్లు నిబంధనలను తూ.చ తప్పకుండా పాటించాలని ఓయూ ఇంజినీరింగ్ కళాశాల డీన్, సీనియర్ ప్రొఫెసర్ ఎం కుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఆయా విభాగాల్లో సూపర్ వైజర్‌లు, వారికి కేటాయించిన పీహెచ్‌డి అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని మెరిట్ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలని స్పష్టం చేసింది.

మెరిట్ విద్యార్థులకు సూపర్ వైజర్ల కొరత ఉన్నప్పుడు అవసరమైతే ప్రొటెం సూపర్ వైజర్లను కేటాయించాలని, తిరిగి ఖాళీలు ఏర్పడ్డప్పుడు పూర్తి స్థాయి ప్రవేశానికి మార్చుకోవాలని సూచించింది. ఇదంతా ఆయా విభాగాల డీన్ల పర్యవేక్షణలో జరగాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు, భవిష్యత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అపోహలతో ఆరోపణలు చేయటం సరికాదని అభిప్రాయపడింది. కమిటీ నివేదికను రానున్న పాలకమండలి సమావేశంలో ప్రవేశపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థాయీ సంఘం అభిప్రాయపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News