Monday, December 23, 2024

ప్రపంచ శాస్త్రవేత్తల జాబితాలో ఓయూ అధ్యాపకుడికి చోటు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన ప్రపంచ ప్రముఖ శాస్త్రవేత్తల జాబితాలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడికి చోటు దక్కింది. సైటేషన్ కౌంట్, హెచ్ ఇండెక్స్, ఐ టెన్ ఇండెక్స్ సహా 44 పరిశోధనా అంశాల ఆధారంగా ప్రపంచంలోని శాస్త్రవేత్తలలో టాప్ 2శాతం జాబితాను స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించిన జాబితా విడుదల చేసింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జెనెటిక్స్ విభాగంలో అనుబంధ ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ పి.బి. రవికిశోర్ ఈ జాబితాలో ఉన్నారు. జెనెటిక్స్ రంగంలో పరిశోధనలకు ప్రొఫెసర్ పి.బి కిషోర్ లభించిన గుర్తింపు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గర్వకారణమని ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. ఇదే ఉత్తేజంతో రవికిశోర్ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆచార్య రవి కిశోర్ గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక విశిష్టతలను దక్కించుకున్నారు. ఓయూ నుంచి దాదాపు 300 కు పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News