Wednesday, January 22, 2025

ఓయూ మాజీ విసి నవనీతరావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

నివాళ్లు అర్పించిన వైన్ ఛాన్స్‌లర్ రవీందర్‌యాదవ్, విద్యార్థులు
విశ్వవిద్యాలయానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ నవనీత రావు (95) కన్నుమూశారు. 1985 నుంచి 1991 మధ్యకాలంలో విసిగా పనిచేశారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆయన మృతి తీరని లోటని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. నవనీత రావు మృతితో జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి పలువురు అధ్యాపకులు, విద్యార్థులు చేరుకుని ఘనంగా నివాళ్లుర్పించారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయ ఖ్యాతిని పతాకస్థాయికి చేర్చిన విశ్రాంత ఉపకులపతి ఆచార్య టి. నవనీతరావు మృతికి ప్రస్తుత ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవిందర్ యాదవ్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మినారాయణ ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఆయన పార్థీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నవనీతరావుతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రొపెసర్ నవనీతరావు అందించిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 1988, ఆ తర్వాత విద్యాసంవత్సరాన్ని కాపాడారని గుర్తు చేశారు. భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శంగా నిలిచారన్న వీసీ, రిజిస్ట్రార్ లు. ఆచార్య నవనీతరావు కుటుంబ సభ్యులు, మిత్రులు, సహోద్యోగులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News