Monday, December 23, 2024

పలు పరీక్షలకు తేదీలను ఖరారు చేసిన ఓయూ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బి, మూడేళ్ల ఎల్‌ఎల్‌బి ఆనర్స్ కోర్సుల రెండు, మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ రెగ్యులర్, ఐదేళ్ల బిఎ ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల బిబిఏ ఎల్‌ఎల్‌బి, ఐదేళ్ల బికామ్ ఎల్‌ఎల్‌బి రెండు, మూడు, నాలుగు, అయిదో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి, ఎల్‌ఎల్‌ఎం మూడో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News