Wednesday, January 22, 2025

తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓయూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మూడు బోధనేతర సంఘాల అధ్వర్యంలో నాన్ టీచింగ్ హోంలో జాతీయ పతాక ఆవిష్కరణ, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి తెలంగాణ యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఎంప్లాయేస్ అసోసియేషన్ పుష్పాంజలి ఘట్టించింది. ఈసందర్భంగా ఈసంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ పౌరులుగా ప్రత్యేకించి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమ కేంద్ర వారసులుగా మన భాద్యతగా భావించి మా కర్తవ్య నిర్వహణలో భాగంగా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, రాష్ట్ర సాధన ఒక స్వప్నం, ఆ స్వప్నం సాకారమైన వేళ,మన ఆకాంక్షలు నెరవేరిన రోజుని పేర్కొన్నారు. భవిష్యత్తు లో సామాజిక తెలంగాణ సాధన కోసం పాటుపడాలని ప్రతిన చేశారు ఈ కార్యక్రమములో శివ శంకర్, ప్రెసిడెంట్, విజయ్ కుమార్, రవి, అక్బెర్ బెగ్, భీమయ్య, జలీల్, భూమరావు, శంకర్ నాయక్ సురేష్, శ్రీనివాస్ శంకరయ్య, రాకేష్ , అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News