Thursday, January 23, 2025

లేడీస్ హాస్టల్ బాత్‌రూమ్‌లో దుండగులు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తమకు వెంటనే రక్షణ కల్పించాలని సికింద్రాబాద్ పిజి కాలేజీ విద్యార్థినులు శుక్రవారం రాత్రి ధర్నాకు దిగారు. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు దుండగులు చొరబడ్డారు. హాస్టల్ బాత్‌రూమ్‌లోకి చొరబడి ఆగంతకులు విద్యార్థినులకు సైగలు చేశారు. వారిని చూసిన విద్యార్థినులు పట్టుకునేందుకు విద్యార్థునులు ప్రయత్నించగా ఒకరు పరార్ కాగా ఒకడిని విద్యార్థినులు పట్టుకున్నారు. చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. తర్వాత విద్యార్థినులు తమకు భద్రత కల్పించాలని కళాశాల గేట్లు మూసివేసి ఆందోళనకు దిగారు. ఇద్దరు దుండగులు బాత్‌రూమ్ కిటికీ అద్దాలను పగులగొట్టి లోపలికి వచ్చారు. ఇది గమనించిన విద్యార్థినులు అందులో ఒకడిని పట్టుకుని చున్నీలతో కట్టివేశారు. మరో నిందితుడిని పట్టుకునేందుకు యత్నిస్తుండగా పారిపోయాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు హాస్టల్ వద్దకు చేరుకున్నారు. ఆంగతకుని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలిస్తుండగా విద్యార్థులు వారిని అడుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు నిందితుడిని తీసుకుపోవద్దంటూ అడ్డంగా కూర్చుకున్నారు. కాలేజీ ప్రిన్సిపాల్‌తోపాటు వీసీపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. హాస్టల్‌లో సిసిటివిలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా వర్సిటీకి చెడ్డపేరు తెచ్చేలా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తర్వాత వారికి పోలీసులు సర్ధిచెప్పి నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మిగతా వారి వివరాలు తెలుసుకునేందుకు దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు.

రిజిస్ట్రార్ హామీతో…
హాస్టల్‌లో దుండగులు చొరబడడంపై విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ అక్కడికి చేరుకున్నారు. విద్యార్థినులతో చర్చలు జరిపి, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని, విద్యార్థినుల పూర్తి రక్షణ బాధ్యత తమపై ఉందని తెలిపారు. హాస్టల్ వెనుక వైపు నుంచి ఎవరూ రాకుండా సీల్ వేస్తామని, మహిళా సెక్యూరిటీ గార్డులను పెంచుతామని హామీ ఇచ్చారు. రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళనను విరమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News