Sunday, December 22, 2024

రూ.8వేల కోట్ల భూమిపై కన్నేసిన నిర్మాత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నకిలీ పత్రాలతో వేల కోట్ల రూపాయలు విలువజేసే ప్రభుత్వ భూమిని కొ ట్టేసేందుకు యత్నించిన టాలీవుడ్ నిర్మాత, మరో ఇ ద్దరిని ఓయూ పోలీసులు మంగళవారం అరెస్టు చేశా రు. పోలీసుల కథనం ప్రకారం…సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ భూమి 83 ఉంది. టాలీవుడ్ నిర్మాత బూర్గుపల్లి శివరామకృష్ణ, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కొ త్తింటి చంద్రశేఖర్, సైదరాబాద్‌కు చెందిన మారగో ని లింగమయ్య కలిసి రాయదుర్గంలోని సర్వే నంబర్ 46లోని ఈ భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. ఈ విషయం బయపడడంతో రాయదుర్గం పోలీసులు ముగ్గురు నిందితులను అక్టోబర్,17,2023లో అరె స్టు చేశారు.

తర్వాత నిందితుడ శివరామకృష్ణ హైకోర్టులో కేసు వేశాడు. విచారణ జరిపిన కోర్టు తార్నాకలోని తెలంగాణ స్టేట్ ఆర్చివ్స్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుంచి భూమికి సంబంధించిన సేల్ డిడ్ పరిశీలించి నిందితులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఫోర్జరీ పత్రాలుగా తేల్చింది. రాజేంద్రనగ ర్ ఆర్‌డిఓ రాయదుర్గం పైగా గ్రామానికి సంబంధించిన పహాణీలు 1950 నుంచి 2024వరకు కోర్టుకు సమర్పించారు. దీంతో సర్వే నంబర్ 46లోని 83 ఎకరాలు ప్రభుత్వ భూమిగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిం ది. ఆర్చివ్స్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం తో ఆర్చీవ్స్ డైరెక్టర్ జరీనా పర్వీన్ సిసిఎస్‌లో ఫిర్యా దు చేయగా కేసు నమోదు చేసి ఓయూ పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తు చేసిన ఓయూ పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఆర్చీవ్స్ రికార్డు పేరుతో…
నిందితుడు శివరామకృష్ణ, నగరంలోని తార్నాకలో ఉన్న తెలంగాణ ఆర్చివ్స్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌తో కుమ్మకై భూమిని కొట్టేసేందుకు ప్లాన్ వేశాడు. చంద్రశేఖర్ ఆర్చివ్స్ నుంచి నకిలీ సేత్వార్, పహాణీని శివరామకృష్ణకు ఇచ్చాడు. వాటిపై ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి శివరామకృష్ణకు ఇచ్చాడు. ఇలా ఇచ్చివాటిలోని సేల్ డీడ్‌లో 15అబాన్ 1259 హిజ్రీగా ఉంది, కానీ ఇది తప్పు ఇది 12మంత్ ఫసిలీ క్యాలెండర్ దానిని హిజ్రీగా పేర్కొనడంతో నకిలీ సేల్ డిడ్‌గా రెవెన్యూ అధికారులు గుర్తించారు. 1887కు ముందు హైదరాబాద్ రాజ్యం అధికార భాష పర్షియన్, ఎలాంటి పత్రాలను ఉర్దులో రాయలేదు, కానీ నిందితులు ఉర్దులో సేల్ డిడ్ చేసినట్లు పత్రాలు సృష్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News