హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రిన్సిపాల్, స్టూడెంట్ అఫైర్స్ డీన్, హిందీ భాషాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన ప్రొఫెసర్ టి.మోహన్ సింగ్ గుండెపోటు మృతి చెందాడు. సోమవారం హైదరాబాదులోని నాగోల్ లో ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
మోహన్ సింగ్ ఉస్మానియా ఆర్ట్ కళాశాలలో పదేళ్లపాటు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్‌గా, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ గా కూడా ఆయన సేవలు అందించారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎన్టీఆర్ కు సలహాదారుడిగా పనిచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామానికి చెందిన మోహన్ సింగ్ ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించి అంచలంచెలుగా ఎదుగుతూ కల్వకుర్తి జూనియర్ కళాశాల లో పదేళ్లపాటు లెక్చరర్ గా పని చేసి పీజీ లో గోల్ఢ్ మెడల్ సాధించారు. తదనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరి రెండు దశాబ్దాలుగా సేవలందించారు. ఆయన మృతిపట్ల ఓయూ విసి రవీందర్, ఇతర ప్రొఫెసర్లు సంతాపం వ్యక్తం చేశారు.