Monday, December 23, 2024

ఓయూ పిహెచ్‌డి నోటిఫికేషన్ విడుదల..

- Advertisement -
- Advertisement -

OU Releases Notification for PHD Admission 2022-23

మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో పిహెచ్‌డి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రవేశాలను రెండు కేటగిరీలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ 1 కింద ప్రవేశాలకు జాతీయస్థాయి ఫెలోషిప్ పొందిన వారు అర్హులని అన్నారు. ఈ కేటగిరీకి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సంబంధిత డీన్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. కేటగిరీ 2 కింద ప్రవేశాలకు అభ్యర్థులు పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష, ఇంటర్వూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.
పిహెచ్‌డి ప్రవేశ పరీక్ష ప్రకటన జారీ
ఉస్మానియా విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఒయు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఐ.పాండు రంగారెడ్డి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు. సంబంధిత విభాగంలో పిజిలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత(ఎస్‌సి,ఎస్‌టి,బిసి, పిడబ్లూడి అభ్యర్థులు 50 శాతం) కలిగి ఉన్న పిహెచ్‌డికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఇతర వివరాలకు www.osmania.ac.in, www.ouadmintions.com వెబ్‌సైట్‌లు చూడాలని సూచించారు.

OU Releases Notification for PHD Admission 2022-23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News