హైదరాబాద్ ః కర్నాటక కొడగు జిల్లా మకుటాలో ఒక భూగర్భగుహ నుండి మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్-వింగ్డ్ బ్యాట్ అనే కొత్త జాతి గబ్బిలం కనుగొనబడింది. ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి శ్రీనివాసులు, యూనివర్సిటీ అఫ్ రీడింగ్, యునైటెడ్ కింగ్డమ్ కి చెందిన పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్ మిస్టర్ ఆదిత్య శ్రీనివాసులు ఈ గబ్బిలాన్ని అనేక ఆధారాల ఆధారంగా వివరించారు. తాము మకుటాలోని పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాలలోని పెద్ద భూగర్భ గుహ నుండి గబ్బిలాల నమూనాలను సేకరించినట్లు, ఇది చిన్న బెంట్-వింగ్డ్ బ్యాట్ అని మేము తాత్కాలికంగా గుర్తించినట్లు చెప్పారు.
ఈ గబ్బిలం నికోబార్ దీవులు, దక్షిణ భారతదేశం, నేపాల్ ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది. అండమాన్ గబ్బిలాలపై మా పరిశోధనలో దీవుల్లోని జంతుజాలం భారతదేశంలోని ప్రధాన భూభాగంలో ఉన్న వాటి కంటే జన్యుపరంగా భిన్నంగా ఉందని వెల్లడించారు. పశ్చిమ కనుమలలోని ఇతర ప్రాంతాల నుండి నివేదించబడిన మకుట నమూనాలు ఇతరాలు రహస్య జాతులు కావచ్చని అనుమానించినట్లు తెలిపారు. మకుట నమూనాలు, ఇతరుల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి మేము వర్గీకరణ అధ్యయనాలు, ఎకోలొకేషన్ జన్యు అధ్యయనాలను నిర్వహించినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగంలో యుజిసి -పోస్ట్ డాక్టోరల్ ఫెలో అయిన డాక్టర్ భార్గవి శ్రీనివాసులు వెల్లడించారు.
బెంట్-వింగ్డ్ గబ్బిలాలు చిన్న గబ్బిలాలు, ఇవి గుహలలో కొన్ని వందల సంఖ్యలో పెద్ద కాలనీలలో నివసిస్తాయి. అవి వాటి శరీరం కంటే 2.5 రెట్లు పొడవుగా ఉండే పొడవైన రెక్కలను కలిగి ఉంటాయి. వాటి రెక్కలు శరీరంపై ముడుచుకుంటాయి, అందుకే వాటిని బెంట్-వింగ్డ్ బ్యాట్ అంటారని చెప్పారు. ఇవి దక్షిణ ఐరోపా, ఆఫ్రికా, మడగాస్కర్, ఆసియా, ఆస్ట్రేలియా, న్యూ కాలెడోనియా వనాటులలో కనిపిస్తాయి. భారతదేశంలో ఈ గబ్బిలాలలో నాలుగు జాతులు ఉన్నాయి, కొత్త జాతి కనుగొనడంతో వాటి సంఖ్య ఐదుకు పెరిగిందన్నారు.
పశ్చిమ కనుములలో రెండు రకముల బెంట్-వినగ్ద్ గబ్బిలాలు దొరుకుతాయి. మా పరిశోధన ద్వారా మేము ఈ రెండిట్లో ఒకటి కొత్త రకమైన జాతి అని కనుగొన్నట్లు తెలిపారు. ఈ జాతి శరీర రచనలో ఇంతకముందు తెలిసిఉన్న జాతులతో ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ ఇవీ జన్యుపరంగా భిన్నంగా ఉన్నాయి. పశ్చిమ కనుమలలోని ఇతర ప్రాంతాల నుండి చిన్న బెంట్-వింగ్డ్ గబ్బిలాలుగా నివేదించబడిన నమూనాలు ఇప్పుడు శ్రీనిస్ బెంట్-వింగ్డ్ గబ్బిలాలకు కేటాయించబడ్డాయి. నేపాల్ ఈశాన్య భారతదేశాల బెంట్-వింగ్డ్ గబ్బిలాల వర్గీకరణ స్థితిని నిర్ధారించాల్సిన అవసరం ఉందని ఆదిత్య శ్రీనివాసులు పేర్కొన్నారు.
వ్యవసాయం, అటవీ, పట్టణ పర్యావరణ వ్యవస్థలలో కీటకాల జనాభాను నియంత్రిస్తుందని కీటకాలు తినే గబ్బిలాలు పర్యావరణపరంగా ముఖ్యమైనవి. ఆర్థిక వ్యవస్థకు వాటి సహకారం ఎంతో ఉందన్నారు. అవి పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రఖ్యాత గబ్బిలాల శాస్త్రవేత్త ప్రొఫెసర్ సి. శ్రీనివాసులు గౌరవార్థం ఈ కొత్త జాతికి పేరు పెట్టారు. ఈ కొత్త జాతియొక్క వివరణ జూటాక్సా జంతు వర్గీకరణ శాస్త్రవేత్తల కోసం పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ మెగా జర్నల్ యొక్క తాజా సంచికలో ప్రచురించబడింది.