- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రభుత్వం ఓయూలో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు. శుక్రవారం ఓయూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆర్ట్ కళాశాల వద్ద నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు టి.మహేందర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేసి సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయాలన్నారు. కనీస వేతనంగా ప్రతి కార్మికుడికి నెలకు రూ.26 వేలు చెల్లించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గతంలో కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామనే హామీని అమలు చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలలోపు తమ రెగ్యులర్ చేస్తే బిఆర్‌ఎస్‌కే మద్దతు పలుకుతామని పలువురు కార్మికులు పేర్కొన్నారు.
- Advertisement -