Monday, December 23, 2024

ఓయూ ఒప్పంద ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాయలంలో తాము గత 25 సంవత్సరాలుగా ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, ప్రభుత్వ జీఓ అమలు కావడంలేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆర్ట్‌కళాశాల వద్ద నాన్ టీచింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు సూర్యచందర్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా ఓయూలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్కార్ తీసుకువచ్చిన జీవో నెం.16 ప్రకారం తమని రెగ్యులరైజ్ చేయాలని, ఓయూ రిజిస్ట్రార్ స్పందించి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమను రెగ్యులరైజ్ చేసేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అంజయ్య, శ్రీనివాస్, వీరేశం, ఎస్.అరుణ్, రాము, సంతోష్, అభిలాష్, రాజేష్, మల్లికార్జున్, సతీష్, ప్రవీణ్, ఫిరోజ్ ఖాన్, శివకుమార్, శ్రీకాంత్, సురేష్, మన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News