Monday, December 23, 2024

టిపిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓయూ విద్యార్థులు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

విద్యార్థులను కించపరిచే వ్యాఖ్యలపై విమర్శలు

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులపై ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి రానున్న సమయంలో ఓయూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై ఉస్మానియా విద్యార్థులు ఎందుకు రాహుల్ గాంధీ రాకను విద్యార్థులు వ్యతిరేకించారని రేవంత్ రెడ్డిని ప్రశ్నించగా… దీనికి సమాధానంగా రేవంత్ రెడ్డి ఓయూ విద్యార్థులకు చిల్లర ఖర్చులకు రాజకీయ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి ఉంటారని, వాటిని తీసుకుని పక్కనే ఉన్న తార్నాకలోని వైన్స్‌లో బీర్లు తాగి, బిర్యాని తిని, అరిగేదాకా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని, ఓయూ విద్యార్థులు అడ్డ మీద కూలీలంటూ, వాళ్ళకంటూ సిద్ధాంతం, ఆలోచన ఉండదని, తెలంగాణ పట్ల గౌరవం ఏమీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆ వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థి సంఘాలు రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేస్తూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విద్యార్థులను అణచివేస్తారని మండిపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News