- Advertisement -
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం నాడు యూనివర్సిటీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేపట్టారు. భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ర్యాలీ చేపట్టారు. ముళ్ల తీగలు వర్సిటీల వైస్‌ఛాన్సలర్ నియంతృత్వ పాలనకు చిహ్నమని విద్యార్థులు అన్నారు. నిరసన సందర్భంగా కొందరు విద్యార్థులు అడ్మినిస్ట్రేటివ్ భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. విద్యార్థులపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని చెప్పిన పోలీసులు నిరసన తెలిపిన విద్యార్థుల గుంపు చెదరగొట్టమన్నారు.
- Advertisement -