Saturday, December 21, 2024

ఓయూ.. విద్యార్థులకు ఉన్నత విలువలు నేర్పుతుంది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉన్నతమైన మానవతా విలువలు అలవర్చుకోవటం ఓయూ ప్రాంగణంలో జరుగుతుందని, విద్యార్థులు అకాడమిక్ చదువుతోపాటు, విజ్ఞానం, మానవత్వం ,సామాజిక దృక్పథం అలవరుచుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ గణేష్ పేర్కొన్నారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్ కళాశాలలో చేరిన పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఓఎస్డి టు విసి ప్రొఫెసర్ రెడ్యానాయక్ హాజరై ప్రసంగిస్తూ ఈ విద్యా సంవత్సరం నుంచి రాబోయే నూతన సంస్కరణలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ మురళీకృష్ణ , సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ అర్జున్ రావు, వైస్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్ అనుపమ, డాక్టర్ బాలునాయక్, స్టూడెంట్ అడ్వైజర్స్ డాక్టర్ కొండా నాగేశ్వర్, డాక్టర్ పి స్వాతి, ఇండక్షన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి ఎస్ స్వాతి వివిధ విభాగాల హెచ్‌ఓడిలు, అధ్యాపకులు, నూతన విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News