- Advertisement -
కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ శుక్రవారం ‘కన్నడ రాజ్యోత్సవ’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కన్నడను ప్రాణ భాషగా చేయడమే ప్రభుత్వ లక్షమని ఆయన ప్రకటించారు. బెంగళూరులో 69వ ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో శివకుమార్ ప్రసంగిస్తూ, ‘మా లక్షం కన్నడను ప్రాణ భాషగా చేయడమే. రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించి మన మాతృభూమికి అందరం వందనం చేయవలసిన అవసరం ఉంది’ అని చెప్పారు.
‘మన రాష్ట్రానికి కర్నాటక అని నామకరణంచేసి 50 ఏళ్లు అయింది. మన భూమి స్వర్గం అని, మన భాష దైవమని, తుంగె, భద్రె, కావేరి, కృష్ణ జలాలు పవిత్రమైనని విశ్వసిస్తుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కన్నడ రాజ్యోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని శివకుమార్ చెప్పారు.ఈ భూమి భాషను, సంస్కృతిని పరిరక్షించవలసిన బాధ్యత కన్నడిగులపై ఉన్నదని శివకుమార్ అన్నారు.
- Advertisement -