Wednesday, January 22, 2025

పేదోళ్లకు ఉచిత న్యాయ సేవ అందించడమే మా లక్షం

- Advertisement -
- Advertisement -
  • దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లీగల్ సెల్ ఆథారిటీలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు
  • లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవాలి
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ ఆథారిటి కార్యదర్శి గోవర్దన్ రెడ్డి

సిద్దిపేట: పేదోళ్లకు ఉచిత న్యాయ సేవ అందించడమే మా లక్షమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ రఘురాం, రాష్ట్ర లీగల్ సర్వీసెస్ ఆథారిటి కార్యదర్శి గోవర్దన్ రెడ్డిలు అన్నారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ ఆథారిటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ ఆథారిటి సిద్దిపేట ఆధ్వర్యంలో శనివారం నల్సా మాడ్యూల్ క్యాంపు 2015 కార్యక్రమానికి జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఒకటవ అదనపు జిల్లా జడ్పి భవాని, అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌లతో అవగాహన సదస్సు నిర్వహించారు. అంతకుముందు సిద్దిపేటలోని 20 మంది ట్రాన్స్‌జెండ్లరకు గుర్తింపు కార్డులు, ఇద్దరికి లేబర్ కార్డులు, వ్యవసాయ లబ్ధిదారులకు సీడ్స్, మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్ధ ప్రారంభించిన ఏర్పాటు చేసిన తర్వాత ఇది మొదటి సమావేశం అన్నారు. ఈ సమావేశం ద్వారా వివిధ వర్గాల లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందన్నారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు సమాన హక్కులు కల్పించి అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఒక్క ట్రాన్స్ జెండరుకూడా ఐడెంటిటి కార్డు తీసుకోవాలని అందుకు కావల్సిన ధృవీకరణ పత్రాలు అందిస్తే న్యాయ సేవాధికార సంస్థ మీకు సహాయ సహకారాలు అందిస్తామని సూచించారు. మీరు గుర్తింపు కార్డు తీసుకోవడం వల్ల ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. పేదరికం శాపం కాదని పేద వారికి కూడా న్యాయం అందజేయాలనే ఉద్దేశంతో లీగల్ సర్వీసెస్ ఆథారిటిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజలకు చట్టాల పట్ల అవగాహన చేయడంతో పాటు ఆర్ధిక స్థోమత లేని పేదవారికి ఉచిత న్యాయం అందించేందుకు న్యా సేవాధికారత సంస్థ పని చేస్తుందన్నారు. అనేక కేసుల్లో కక్షిదారులను సమన్వయ పరిచి వారిని ఓప్పించి రాజీయే రాజమార్గమని రాజీ కుదర్చడం ఒక ప్రధాన ఉద్దేశమన్నారు. నేషనల్ లోక్ అదాలత్‌లో లక్షల్లో కేసులు పరిష్కారం చేస్తున్నారని తెలిపారు. న్యాయవాదులు, పోలీసులు, కక్షిదారులు, సిబ్బంది అధికారుల సమన్వయంతో లోక్ అదాలత్ విజయవంతంగా నడుస్తుందన్నారు. సమాజంలోని ప్రతిఒక్కరికీ వారి హక్కులను బాద్యతలను ఎలా ఉపయోగించుకోవాలో కూడా సాధికారత సంస్థ తెలియజేస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లీగల్ సెల్ ఆథారిటిలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగలు కల్పించడం జరిగిందన్నారు. ఉద్యోగ నోటిఫికేన్లలో ఇక ముందు జెండర్ ప్రొవిజన్ కూడా ఆప్లికేషన్లలో కల్పించడం జరుగుతుందన్నారు.

గతంలో హక్కులు, చట్టాల గురించి అవగాహన లేదని అలా తెలియని పరిస్థితుల నుంచి ఇవాళ అందరికి హక్కులు ఉన్నాయనే పరిస్థితికి చేరామని తెలిపారు. సమాజంలో ఉన్న ఆలోచనలకు రూపం ఇచ్చేది చట్టమని, దానికి ప్రాణమిచ్చేలా అమలు చేసేదే పద్దతిగా చట్టం ఉంటుందని చెప్పారు. మన దేశం సంక్షేమ రంగంలో ఎ ంతో ముందుకెలుతుందన్నారు. సమాజంలో అందరు సమానమేనని బేధాభిప్రాయాలు ఉండకూడదన్నారు. అభివృద్ధి అందరికి అందే విధంగా మన దేశాన్ని, రాష్ట్రాన్ని తీసుకెలుతున్నట్లు తెలిపారు. ట్రాన్స్‌జెండర్ చట్ట గురించి అవగాహన కల్పించి వారికి ఇంత తక్కువ సమయంలో గుర్తింపు కార్డులు అందజేయడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ ఆథారిటి సెక్రటరి జడ్జి స్వాతిరెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మలింద్ కాంబ్లే, జూనియర్ సివిల్ జడ్జీలు సౌమ్య, వల్లాల శ్రావణి యాదవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు దేవునూరి రవీందర్, న్యాయవాదులు లక్ష్మినారాయణ శివాజీ గణేశ్, కనకయ్య, రవీందర్, ప్రకాశ్, వెంకట లింగం, కనకయ్య, బాలయ్య, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ ,న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News