Wednesday, January 22, 2025

మన క్రీడాకారులు ఇతర రాష్ట్రాలకు నమూనా

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వ స్ఫూర్తితో రాష్ట్రానికి దేశానికి ఖ్యాతి తెస్తున్నారు
స్వాతంత్య్ర వేడుకల్లో శాట్స్ ఛైర్మన్ ఆంజనేయగౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో దశాబ్ది కాలం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల సమీకృత సమ్మిళిత అభివృద్ధిని సాధించినట్లుగానే క్రీడాభివృద్ధిలో కూడా ద్విగినీకృతమైన అభివృద్ధిని సాధించి ఇతర రాష్ట్రాలకు నమూనాగా చేసి చూపెట్టారని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో హరితహార ఉద్యమం లాగా క్రీడాజ్యోతిని ఊరూరా వెలిగిద్దామని అన్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్ ) ఆధ్వర్యంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎల్ బి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ క్రీడాకారులు అద్భుతమైన విజయాలతో తెలంగాణకు తద్వారా దేశానికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడుతున్నారన్నారు. ప్రపంచ దేశాలలో చివరకు శత్రుదేశాలలో కూడా జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయగలిగేది క్రీడాకారులేనన్నారు. అటువంటి క్రీడాకారుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత యావత్ క్రీడా సమాజానికి ఉంటుందని ఆంజనేయ గౌడ్ అన్నారు. క్రీడాకారులకు అత్యున్నత గౌరవాన్ని ప్రోత్సాహాన్ని, అలాగే ప్రోత్సాహకాలను అందించే రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

కెసిఆర్ అందిస్తున్న స్ఫూర్తిని వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యతా.. కర్తవ్యం క్రీడా అధికారులకు కోచ్‌లకూ సిబ్బందికి ఉందని ఆయన అన్నారు. కెసిఆర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో మరింత క్రీడా ప్రోత్సాహక విధానాలతో ముందుకెల్దామని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు కోచ్‌లు, సిబ్బంది పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News