Friday, November 15, 2024

 మన ప్రవర్తన భారతీయ విలువలకు తగినట్లుండాలి: మోడీ

- Advertisement -
- Advertisement -

Modi
సిమ్లా: రానున్న 25 సంవత్సరాల్లో శాసనకర్తలు, పబ్లిక్ సర్వెంట్ల కొత్త మంత్రంలో విధి అనేదే ముఖ్యం కావాలని ప్రధాని మోడీ బుధవారం అన్నారు. శాసనసభలో నాణ్యత, చర్చల మర్యాదలు భారతీయత సూర్తిని సంతరించుకోవాలన్నారు. “రానున్న 25 సంవత్సరాలు భారత్‌కు చాలా ముఖ్యమైనవి. బాధ్యత, పూర్తి నిబద్ధత అనేవి మన ఒకే ఒక మంత్రం కావాలి. ప్రతిచర్య, మాట, జీవన విధానంలో విధినిర్వహణ అనేది ఉండాలి. ప్రతి పౌరుడిపై, అభివృద్ధిలో అది ప్రభావం చూపగలదు. మనల్ని పురోగమన దిశకు తీసుకెళ్లేది విద్యుక్తధర్మమే” అన్నారు. సిమ్లాలో ‘ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కానరెన్స్(ఎఐపిఒసి) శతాబ్ది సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ విషయం తెలిపారు. ‘వన్ నేషన్ వన్ లెజిస్లేటివ్ ప్లాట్‌ఫామ్’నిర్మించాలని ఆయన సూచించారు. మన పార్లమెంటరీ విధానానికి ఊతం ఇచ్చేలా ఓ పోర్టల్ ఉండాలని, ఆ పోర్టల్ శాసనకర్తలందరికీ రీసెర్చ్ మెటీరియల్ అందివ్వాలని, అన్ని రాష్ట్ర అసెంబ్లీలను డిజిటలైజ్ చేయాలని ఆయన అన్నారు. మన విధానాలు, మన చట్టాలు భారతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేవిగా ఉండాలని, ‘ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్’గా దేశాన్ని తీర్చిదిద్దాలన్నారు. శాసనసభ్యులు తమ ప్రజా జీవితం అనుభవాలను వ్యక్తంచేసేలా ఏడాదిలో మూడునాలుగు రోజులు శాసనసభలో కేటాయించాలని కూడా ప్రధాని మోడీ సూచించారు. ఇదిలావుండగా లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా శాసనసభలను హుందాగా ఉంచేందుకు నిర్ణయాత్మక చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News