మనతెలంగాణ/ హైదరాబాద్ : మన సంస్కృతి, వారసత్వం గొప్పదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాలాన్ని గౌరవించి.. ప్రకృతిని రక్షించుకోవడమే ఉగాది సందేశమని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే సంస్కృతికి ఉగాది ప్రతీక అన్నారు. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశమే వ్యక్తిత్వ వికాసం పాఠమని వెల్లడించారు. భారత్ ఎదుగుదల చూసి పాశ్చాత్య దేశాలకు అసూయ అని.. మన ప్రగతిని అడ్డుకునేందుకు అనేక కుయుక్తులు పన్నుతారన్నారు. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కులం కంటే గుణం మిన్న అనేదాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సంప్రదాయ దుస్తులు, ఆహారం.. పెద్దలు మనకిచ్చిన ఆస్తి అని గుర్తుచేశారు. ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకరశర్మ పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల్లో కామినేని శ్రీనివాస్, చిగురుపాటి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మన సంస్కృతి, వారసత్వం గొప్పది: ఉప రాష్ట్రపతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -