Friday, December 27, 2024

అమరులను పూజిస్తాం .. అవమానించే సంస్కృతి మాది కాదు: ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ కోసం ‘ప్రాజెక్ట్ కెసిఆర్’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘ ప్రాజెక్టు కెసిఆర్ ’ కింద తెలంగాణ కళలు , సాహిత్యము, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తామని కవిత వెల్లడించారు. ఇప్పటికే తాము 40 వేల పుస్తకాలను సేకరించామని, ఎవరి దగ్గరైనా కూడా సంబంధిత అంశాలకు సంబంధించిన పుస్తకాలు వివరాలు ఉంటే తమకు అందించాలని విజ్ఞప్తి చేశారు. ‘కెసిఆర్ అంటే కళాకారులు, చరిత్రకారులు, రచయితలు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ కెసిఆర్‌గా నామకరణం చేశామని అని అన్నారు.

భారత్ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆబిడ్స్‌లో తెలంగాణ సారస్వత పరిషత్తులో జరిగిన తెలంగాణ సాహిత్య సభల ముగింపు సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హజరు కాగా.. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురి గౌరిశంకర్ , తెలంగాణ గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేశామని తెలిపారు. పిల్లల్లో భాష మీద మక్కువ పెరగాలనీ ఆకాంక్షించారు. తెలంగాణ చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు అని, ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకుంటున్నామని అన్నారు. ‘ఇవాళ కొన్ని పత్రికలు సమైక్య రాష్ట్రంలో ఏ విధంగా ఎడిచాయో ఆ విధంగా ఇప్పుడు కూడా ఏడుస్తున్నాయన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభించుకుంటున్నా.. సమైఖ్య ఆంధ్రలో ఉన్నట్టే కొన్ని పత్రికలు రాస్తున్నాయన్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేస్తున్న పత్రికల మనసు మారాలని కోరుకుంటున్నానని కవిత అన్నారు. ప్రతి క్షణం ప్రతి రోజు ఆ పత్రికలు విషం చిమ్ముతునే ఉన్నాయన్నారు. కొన్ని పత్రికలు ఇక్కడ జ్యోతులు కావు అంటూ అన్ని అంశాలను రాజకీయం చేస్తున్నా
యని కవిత వ్యాఖ్యానించారు.

అమరవీరులను తల మీద పెట్టి పూజిస్తామని, అవమానించే సంస్కృతి మనది కాదని స్పష్టం చేశారు. మనది పేద రాష్ట్రం కాదనీ, అమరులను తప్పకుండా గౌరవించుకుంటామని అన్నారు. ఇకముందు బాల సాహిత్య ప్రచురణ సాహిత్యం మిస్ అవుతున్నటువంటి సందర్భంగా బాల సాహిత్యం ప్రచురణ చేసి స్కూల్ లైబ్రరీలో అందించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ చరిత్రను భారతదేశ వ్యాప్తంగా తెలియజేస్తామని చెప్పారు. తెలంగాణలో బౌద్ధం, జైనం మీద బుక్స్ తీసుకోస్తామని అన్నారు. పాఠశాలలో పిల్లలకు సాహిత్యం మీద పట్టుకొసం ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకోస్తామని తెలియజేశారు.మహిళల కొసం ఫస్ట్ ఉమెన్ ,బై వుమెన్ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. తెలంగాణ సాహిత్యం మీద గంభీరమైన చర్చ జరగాలన్న ఉద్దేశంతో తెలంగాణ సాహిత్య సభలు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ చరిత్రలో ఇవాళ సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు కూడా అని అంటూ ట్యాంక్ బండ్ దగ్గర అమర జ్యోతిని ఆవిష్కరించుకున్నామన్నారు. రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నామని, అమరవీరులను తల మీద పెట్టి పూజిస్తాం కానీ..అవమానించే సంస్కృతి మనది కాదన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం ప్రారంభించనున్న సమైఖ్య ఆంధ్ర లో ఉన్నట్టే కొన్ని పత్రికలు రాస్తున్నాయని అన్నారు. తెలంగాణలో బౌద్ధం, జైనం మీద బుక్స్ తీసుకోస్తామని, పాఠశాలలో పిల్లలకు సాహిత్య మీద పట్టుకొసం ప్రత్యేకంగా కార్యక్రమం తీసుకోస్తామని తెలిపారు. మహిళల కొసం ఫస్ట్ ఉమెన్ ,బై వుమెన్ కార్యక్రమం చేపడతామని అన్నారు.

అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలురి గౌరిశంకర్ మాట్లాడుతూ 2006 నుండి తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతిని స్థాపించి సాహిత్య ,సంస్కృతిక రంగాల వికాసానికి కృషి చేస్తున్న భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. పాల్గొన్న ఉద్యమంలో విజయం సాధించడం.. విజయం సాధించిన తర్వాత సంస్కృతి సాహిత్యం కార్యక్రమం కొనసాగించడం గొప్ప విషయం అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కవులుఉన్నారు.. కానీ మన రాష్ట్రంలో వారిని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేసి సంస్కరించుకున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. తెలంగాణ కవి ఉన్నది ఉన్నట్లు రాసేవాళ్లు .. సమాజంలో మార్పు వచ్చినప్పుడు.. కవి రాస్తాడు ఇప్పుడు అదే జరుగుతుందని అని జూలూరు గౌరీ శంకర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ కవిత్వం జీవితానికి దగ్గర ఉండాలన్నారు. మహిళలకు ఒక స్వరంగా సాహిత్యం మారిందని, సమైక్యం అనే పర్వతాన్ని పెకిలించి..తెలంగాణ రాష్ట్రం సాధించామని అన్నారు. దేశంలో.. దమనకాండకు గురిఅవుతున్న వాళ్లకు భారత జాగృతి అండగా ఉండాలని కోరారు. కాగా ఈ సందర్బంగా తెలంగాణ సాహిత్య సభలో పాల్గొన్న కవులను భారత జాగృతి అధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కవిత ఘనంగా సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News