Monday, December 23, 2024

భవిష్యత్తులో మా సిఎం అభ్యర్థి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : రాష్ట్రంలో మున్సిపల్ పట్టణాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కెటిఆర్) రాబోయే రోజుల్లో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఖమ్మంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్ని ప్రసంగిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి పార్టీలు తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే చెప్పే ధైర్యం లేదు కాని బిఆర్‌ఎస్ తరుపున ప్రస్తుతానికి కెసిఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారని, భవిష్యత్తులో యువ డైనమిక్ నాయకుడు కెటిఆర్ ఉన్నారని ఆయన చెప్పారు. క్యాబినెట్ లో తనను ఒక్కడినే అరేయ్… అనే పిలిచే చనువు ఉందని, నాలుగు గోడల మధ్య హైదరాబాద్ లో తాను హైదరాబాద్ లో ఈ పని చేశానని, ఖమ్మంలో కూడా చేపట్టాలని ఆదేశించారని ఆయన అన్నారు. తాను పనిచేసేవిధంగా ముల్లు కర్ర పెట్టి ఉరికించి పనిచేయించారని, ఇది కేవలం కెటిఆర్ వల్లనే సాధ్యమైందని, ఇతరులు ఎవరూ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన ఇలా సాధ్యం కాదన్నారు.

అంతా గొప్ప క్వాలిటీ ఉన్న మహానీయుడు కెటిఆర్ అన్నారు. మిషన్ భగీరథ పథకానికి అంకురార్పణ చేసిందే ముఖ్యమంత్రితోపాటు కెటిఆర్ అని ఆయన అన్నారు. ముందుగా పంచాయతీ రాజ్ శాఖ తీసుకొని ఆ తరువాత మున్సిపల్ అర్బన్ శాఖ తీసుకున్నారని ఆయన అన్నారు. పనిచేయాలనే పట్టుదల, మానవత్వం కలిగిన వ్యక్తి మంత్రి కెటిఆర్ అన్నారు. ఖమ్మం ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే దానికి ప్రధాన కారణం కెటి ఆరే నని ఆయన అన్నారు. ఖమ్మంలో తాను చేసిన అభివృద్ధి వెనక మంత్రి కెటిఆర్ ఉన్నారని ఆయనతో పాటు కెసిఆర్ ఇచ్చిన ప్రొత్సాహం, వందలాది కోట్ల నిధుల విడుదల వల్లనే తాను ఇంతా అభివృద్ధి చేయగలిగనని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News