Thursday, January 23, 2025

రాష్ట్రాభివృద్ధే మా లక్ష్యం

- Advertisement -
- Advertisement -

న్‌డిఎలో చేరుతానని కెసిఆర్ కోరితే తిరస్కరించా

మన తెలంగాణ/హైదరాబాద్/ నిజామాబాద్ బ్యూరో : ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సి న్ అందించిన ఘనత తెలంగాణదే‘ అని ప్ర ధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. జిహెచ్‌ఎంసి ఎ న్నికల తరువాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఢిల్లీ వచ్చి తనను కలిశారని, ఎన్‌డిఎలో చే రుతానని ఆయన ఈ సందర్భంగా ప్రతిపాదించారని, అయితే తాను ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని మోడీ సం చలన ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జి ల్లా పర్యటనలో భాగంగా గిరిరాజ్ కళాశాల మైదానంలో మంగళవారం ఏర్పా టు చేసిన బిజెపి జనగర్జన సభకు ఆయ న ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. సభావేదికపై నుంచే..పలు అభివృద్ధి పనుల ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. దాదాపు రూ. 8012కోట్ల వ్య యం తో చేపట్టిన పలు ప నులకు ప్రధాని ప్రారంభోత్సవాలు చేశా రు. రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును జాతి కి అంకితం చేశారు.మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేలైన్‌ను ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రసంగం ప్రారంభించారు.ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి యూనిట్‌ను ప్రారంభించుకున్నట్లు చెప్పిన ప్రధాని… త్వరలోనే రెండో యూనిట్ అందుబాటులోకి వస్తుందని హామీ ఇచ్చారు. ఎన్టీపీసీతో రాష్ట్ర ప్రజలకు 4 వేల మెగావాట్ల విద్యుత్ అం దుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణ ప్రజల కో సం బీబీనగర్‌లో ఎయిమ్స్ నిర్మిస్తున్నట్లు మోడీ చె ప్పారు. ధర్మాబాద్,- మనోహరాబాద్,- మహబూబ్‌నగర్, -కర్నూలు లైను విద్యుద్దీకరణ పూర్తి చేసుకు న్నాం. ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేస్తున్నాం అన్నారు.

జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత కెసిఆర్ వైఖరి మారింది
రాష్ట్రంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత ముఖ్యమం త్రి కెసిఆర్ వైఖరి పూర్తిగా మారిపోయిందని ప్రధాని ఆరోపించారు. ‘జిహెచ్‌ఎంసి ఎన్నికల తర్వాత కెసిఆర్ ఢిల్లీ వచ్చి నన్ను కలిశారు. నాపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. రాష్ట్రంలో పాలనా పగ్గాలు కెటిఆర్ కు ఇస్తానని చెప్పారు. ఆయనను ఆశీర్వదించాలని కోరారు. ఇది రాజరికం కాదని నేను చెప్పాను. ప్రజ లు ఆశీర్వదించిన వారే పాలకులవుతారని స్పష్టం చే శాను’ అని వివరించారు. హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో సహకరించాలని, ఎన్‌డిఎ కూటమిలో చేరుతానని కెసిఆర్ ప్రతిపాదించారని, అయితే ఆ ప్రతిపాదనను తోసిపుచ్చానని తెలియజేశారు. బిఆర్‌ఎస్‌తో పొ త్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పానని, విపక్షంలోనైనా కూర్చుంటాం కానీ, బిఆర్‌ఎస్‌కు మద్ద తు ఇవ్వనని తెగేసి చెప్పానని అన్నారు.

మహిళలకు అభినందనలు..
కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లు రూ పొందించుకున్నట్లు గుర్తు చేసిన ప్రధాని.. భరతమాత రూపం లో సభకు వచ్చిన మహిళలకు అభినందనలు తెలిపారు. ‘మహిళలు పెద్ద సంఖ్యలో రా వడం నా అదృష్టంగా భావిస్తున్నా. భవిష్యత్‌లో మ రింత మహిళా శక్తిని మనం చూడనున్నాం. తెలంగా ణ తల్లులు, చెల్లెమ్మలు ఓట్ల రూపంలో బిజెపిని ఆశీర్వదించాలని కోరారు. ప్రపంచానికి కొవిడ్ వ్యాక్సిన్ అందించిన ఘనత తెలంగాణదే‘ అని మోడీ అన్నా రు. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరిం త మెరుగుపర్చుతున్నామని, ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా తెలంగాణలో 70 లక్షల మందికి బీమా సౌ కర్యం కల్పించామన్నారు. ఆసుపత్రిలో మౌలిక వసతులతో పాటు మెడికల్ కాలేజీలను పెంచుతూ అం దుకనుగణంగా డాక్టర్లు, స్టాఫ్ నర్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే లైన్లను 100శాతం విద్యుద్దీకరణ చేస్తామని వెల్లడించా రు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎత్తుగడ లు వేస్తోందని, అమలు కానీ హామీలను ఇస్తుందని ఆయ న దుయ్యబట్టారు. లోపాయికారిగా బిఆర్‌ఎస్ పార్టీతో కాం గ్రెస్‌పార్టీ చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌కు సహకారం అందించిందని రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ రుణం తీర్చుకునే పనిలో ఉందన్నారు. ఈ సభలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపిలు అర్వింద్, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు.

అన్నిరంగాల్లో అభివృద్ధి : కిషన్‌రెడ్డి
ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 2014కు ముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి. ప్రసుత్తం ఎక్కడ కూడా విద్యుత్ కొరత లేదు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామిక రంగానికి అంకితం చేశారు. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చి మోడీ ప్రాణాలు కాపాడారు. హైదరాబాద్‌లో సొంతంగా వ్యాక్సిన్ తయారుచేసుకున్నాం. 84 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానిదే. పసుపుబోర్డును సాకారం చేసి రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకున్నారు.

పసుపు రైతుకు అభినందనలు: ప్రధాని
నిజామాబాద్ జనగర్జన సభలో పసుపు బోర్డ్ ఉద్య మ నాయకుడు మనోహర్‌రెడ్డి గురించి ప్రధాని నరేం ద్ర మోడీ ఆరా తీశారు. బిజెపి జాతీయ ప్రధాన కా ర్యదర్శి బండి సంజయ్‌తో… పసుపు బోర్డ్ కోసం 12 ఏళ్లపాటు చెప్పులులేకుండా తిరిగిన కార్యకర్త పేరేమి టి? ప్రధాని మోడీ ఆరా తీశారు. ప్రధానికి… ఆ రైతు పేరు మనోహర్‌రెడ్డి. పసుపు బోర్డ్ కొసం ఎన్నో ఏళ్లు గా పోరాడుతున్నాడు. పసుపు బోర్డ్ వచ్చేదాకా కా ళ్ళకు చెప్పులు వేసుకోబోనని శపథం చేసి 2011 న వంబర్ 4 నుండి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాడని బండి సంజయ్ వెల్లడించారు. మనోహర్ రెడ్డి లక్ష్యం నెరవేరింది. నా తరపున ఆయనకు అభినందనలు చెప్పండి… అని ప్రధాని మోడీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News