Saturday, December 28, 2024

మన పాలన దేశానికే ఆదర్శం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ ప్రభుత్వ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ జడ్‌పి చైర్మన్ దావ వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిపాలన దినోత్సవం సందర్భంగా చిన్న రాష్రాలే పరిపాలన సౌభాగ్యానికి మైలు రాయి అని చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్, రాజ్యాంగంలోనే జిల్లా చిన్న రాష్ట్రాల అవతరణ కొరకు ఆర్టికల్ 3ని పొందు పరిచిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్‌కు, అమలు పరిచి రుజువు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన గురుదర బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.

పరిపాలన సంస్కరణలతో తెలంగాణను ప్రగతి పథంలో నిలిపారని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్లలో ఎన్నో అద్బుతాలు చోటు చేసుకున్నాయని అన్నారు. గత పాలనలో రూ.200 పెన్షన్‌ను రూ.2000 వేలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కుతుందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, మండలాలను పెంచి పరిపాలనను సౌలభ్యం చేసింది కెసిఆర్ ప్రభుత్వమేనని అన్నారు.

పరిపాలన సౌలభ్యం కోసం నూతన కలెక్టరేట్ కార్యాలయాలను, నూతన ఎస్‌పి కార్యాలయాలను ఆధునిక హంగులతో నిర్మించిన ఘనత కెసిఆర్‌దేనని అన్నారు. 2014కు ముందు పరిపాలనను రూ.2014 తర్వాత పరిపాలనను ప్రజలు గమనించాలని, గత ప్రభుత్వాలు ఎందుకు ఇంత చేయలేకపోయానని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న పాలనను ఎన్నో రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని అన్నారు.

సిఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు సుపరిపాలన పెద్ద పీట వేశాయని, ప్రజల వద్దకు పాలన అందించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి అని, భవిష్యత్తు సవాళ్లకు సుపరిపాలననే ధీటైన జవాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష, ఎస్‌పి భాస్కర్, అదనపు కలెక్టర్లు బిఎస్ లత, మంద మకరంద్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్‌రావు, మున్సిపల్ చైర్మన్‌లు, జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News