Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్ ఎన్నికల బందోబస్తుకు మన హోంగార్డులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రదేశ్ శాసన సభకు జరుగనున్న ఎన్నికలలకు బందోబస్త్ సేవల నిమిత్తం తెలంగాణాకు చెందిన 2000 హోంగార్డ్ లను ఛింద్వారా, సియాన్ జిల్లాలకు తెలంగాణా పోలీస్ శాఖ పంపింది. హోంగార్డ్ అడిషనల్ డిజి అభిలాష బిస్త్ మార్గదర్శకత్వంలో మధ్యప్రదేశ్ కు వెళ్లిన ఈ రెండు వేలమంది హోంగార్డ్‌ల కంటిజెన్సీకి హోంగార్డ్ ఎస్.పి. ఐ.ఆర్.ఎస్. భాస్కర్, ఎసిపి ఎం.భాస్కర్‌లు పర్యవేక్షకులుగా ఉన్నారు.

హైదరాబాద్‌కు చెందిన 800 మంది హోంగార్డ్‌లకు ఎసిపి పి.అరుణ్ కుమార్ , ఇతర జిల్లాలనుండి వచ్చిన 1800 మంది హోంగార్డులకు ఎసిపి భాస్కర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈనెల 17న జరిగే ఎన్నికల అనంతరం తిరిగి, ఈ హోంగార్డ్‌లు 19 వతేదీన హైదరాబాద్‌కు చేరుకుంటాని ఒక అధికార ప్రకటనలో వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News