Thursday, January 23, 2025

పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్న మన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు పెద్దన్న మన కెసిఆర్ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజక వర్గ పరిధిలోని చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్ ,నారాయణరావుపేట మండలాలలోని 149 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆత్మీయ బంధువు సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వైద్య పరీక్షలు టీఫా స్కానింగ్, న్యూట్రిషన్ కిట్, కేసిఆర్ కిట్ అందిస్తున్నామని తెలిపారు.

ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథాఖర్చు చేసుకోవద్దన్నారు. గర్బిణీలకు రక్తహీనత తగ్గించేందుకు గోళీలు ఇస్తున్నమని, అమ్మబడి వాహానం సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదింటి ఆడబిడ్డకు ఆసరాగా నిలిచి కడుపు నిండా మీకు రుచికరమైన బోజనం పెట్టి రూపాయి లంచం లేకుండా కళ్యాణ లక్ష్మి, షాధి ముబారక్ ,సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు.

నియోజకవర్గంలోని 149 మంది లబ్ధిదారులకు రూ.1.49,17,584 కోట్లు రూపాయల చెక్కులను అందించినట్లు తెలిపారు. పేద ప్రజలు మీరంతా ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజారాదాకృష్ణశర్మ, ప్రజాప్రతినిధులు , నాయకులు కడవేర్గు రాజనర్సు, వేలేటి రాదాకృష్ణశర్మ, కూరమాణిక్యరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News