Tuesday, December 24, 2024

మన ప్రాంతం పురాతన ఆలయాలకు నెలవు

- Advertisement -
- Advertisement -
  • ఆలయం ఎంతో మహిమాన్విత క్షేత్రం
  • 50 లక్షలతో అలయాన్ని అభివృద్ధి చేస్తున్నాం
  • నేడు ప్రపంచ వ్యాప్తంగా మన రామప్ప పేరు ఖ్యాతి గడించింది
  • సనాతన ధర్మాన్ని పాటించే ప్రతిఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని సందర్శించాలి
  • శరబేశ్వర స్వామి ఆలయ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం
  • రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట: మన ప్రాంతం పురాతన ఆలయాలకు నెలవు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని శరబేశ్వర స్వామి ఆలయ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనంత రం నూతన పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తె లిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోగేశ్వర ఆలయ ంకు, శరబేశ్వర ఆలయానికు సోరంగం అంటే దారి ఉ ంటుందని చరిత్రలో ఉందన్నారు. పరమ శివుడు పాదం మోపాడని అందుకే మన ప్రాంతం పురాతన ఆలయాలకు నెలవుగా మారిందన్నారు. 50 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. సిద్దిపేట దైవ భూమిగా విరాజిల్లుతుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ దేవాలయాల కోసం ప్రత్యేక నిధులు తేచ్చారా నిధులు దో చుకున్న చరిత్ర గత ప్రభుత్వాలదన్నారు. నిధులు ఇ స్తున్న చరిత్ర మన ప్రభుత్వానిదన్నారు. సిఎం కెసిఆర్ దై వ సంకల్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే ఆలయాల కు ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

నూతన పాలక వ ర్గం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నేడు ఆలయాల వైభవానికి నాటి యాదగిరిగుట్టనే నేటి యా ద్రాది అన్నారు. నాడు యాదగిరిగుట్టకు పోయే పరిస్థితి ఉండేనా స్వామిని ఎంత ఇరుకుటంలో చూసే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ఆధ్యాత్మిక వైభవ ప్రతీకైన యాదగిరి దేవాలయం పునర్నిర్మాణం ఒక అద్భుతమని యావన్మందీ జనం కొనియాడుతున్నారు. కాళేశ్వరం నుంచి మొదలు పెడితే కొండపోచమ్మ వరకు దేవుళ్ల పేరుతోనే మన రిజర్వాయర్‌లను నిర్మించుకున్నామన్నారు. రాష్ట్రంలో నేడు 2234 ఆలయాలు, కల్యాణ మండపాలు 553 కోట్లతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. సిద్దిపేట జిల్లాలో ఒక నాడు ఒక్క ఆలయం కూడా అభివృద్ధికి దనోచుకోలేదన్నారు. రాష్ట్రం వచ్చాక ఎన్నో ఆలయాలు అభివృద్ధి చేసుకున్నామని అన్నారు. మరి నేడు సిద్దిపేట శుద్దిపేట.. అభివృద్ధికి పుదోట పరవళ్లు తొక్కే పచ్చదనం ఆహ్లాదం పర్యాటక కేంద్రం జలశయాలకు నెలవు అన్నారు.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే అనే విధంగా ఇంటింటికి యోగా కార్యక్రమంలో ప్రతి వార్డులో చేస్తున్నాం. ప్రతిఒక్కరూ యోగా చేయాలి. యోగ అనేది మన దిన చర్యలో భాగం కావాలన్నారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఏ ఇల్లు వెస్టేజ్ లేని పరిశుభ్రంగా ఉంటుందో వారికి ప్రైజ్ ఇస్తామన్నారు. సిద్దిపేట చెత్త కుండి లేని ప్లాస్టిక్ రహిత సిద్దిపేటగా మార్చాలన్నదే నా తపన అన్నారు. ఇది నా ఒక్కరి కోరకో కాదు ప్రజల ఆరోగ్యం కోసం చేసే గొప్ప కార్యక్రమం అన్నారు.

నూతన పాలక మండలి సభ్యులు

గట్టపల్లి రాజేశ్వర శర్మ శాశ్వత పాలక మండలి చైర్మన్, సభ్యులుగా గందె ఎల్లేశం, పెరక నాగరాజు, బిజ్జ అనిత, లుక్కా నాగరాజు, బేజగాం మల్లేశం, చింత చందులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News