Monday, November 18, 2024

సినీ నటి కరాటే కళ్యాణిపై మా విధించిన సస్పెన్షన్ అన్యాయం

- Advertisement -
- Advertisement -

నాంపల్లి : తెలుగు మూవీ ఆర్టిస్తూ అసోసియేషన్ (మా)లో సినీ నటి కరాటే కళ్యాణి సభ్యత్వాన్ని సస్పెన్షన్‌లో పెట్టడం అన్యాయమని ద్రవిడ దేశం అధ్యక్షుడు కృష్ణారావు నిరసన వ్యక్తంచేశారు.ఖమ్మం నగరం లకారం చెరువులో శ్రీకృష్ణ పరమాత్ముని రూపంలో రాజకీయ నాయకుల శిలా విగ్రహం పెట్టడం సరైనది కాదంటూ కళ్యాణి అభ్యంతరం తెలిపిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. కళ్యాణి చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేని మా సంఘం ఆమెకు షోకాజ్ నోటీస్ ఇవ్వడం, సంఘంలో సభ్యత్వాన్ని సస్పెన్షన్‌లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

దివంగత నేత ఎన్టీఆర్ మహనటులు, మాజీ సీఎంగా అన్ని వర్గాల ఆధరణ చురుగోన్న గొప్ప నాయకుడని ప్రస్తుతించారు. మహానటుల శిలా విగ్రహాలు అనేకమున్న ఎవరూ ఆక్షేపించలేదన్నారు. అయితే కొందరు రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం శ్రీ కృష్ణుడి రూపంలో ప్రతిమను ఏర్పాటుచేయడం ఏ మాత్రం తగదని ఆయన పేర్కొన్నారు. లోగడ ఎన్టీఆర్‌ను దూషించి కించపర్చిన వ్యక్తులపై సంఘం ఎలాంటి చర్యలు చేపట్టలేదని గుర్తుచేశారు.బడుగువర్గాలకు చెందిన కళ్యాణికి మాత్రం చర్యలు తీసుకునేందుకు యత్నించడం విచారకరమన్నారు. ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News