Wednesday, January 22, 2025

మనఊరు మనబడితో పాఠశాలకు మహర్దశ

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డిపేట : ప్రభుత్వ పాఠశాలలకు మౌళిక వసతులు కల్పించి విద్యాబోధనలో నూతన సంస్కరణలు అమలు చేయుటకు ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మన ఊరు మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బిఅర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు.

ఇందులో భాగంగా సర్వాంగా సుందరంగా అన్ని హంగులతో తీర్చి దిద్దిన ఎల్లారెడ్డిపేట నూతన పాఠశాల భవణ సముదాయాన్ని ఈ నెల 20 న ఐటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలసి ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో మాట్లాడుతూ గంభీరావుపేట కెజి టు పిజి కళాశాల భవణ ప్రాంగణం ఆదర్శంగా తీసుకొని రూ, 8 కోట్లు ఖర్చు చేసి నూతన భవణం నిర్మించినట్లు తెలిపారు.

ఇందులో అంగన్ వాడి, ప్రాథమిక , ఉన్నత పాఠశాలకు చెందిన వెయ్యి మంది విద్యార్థులు కలసి చదువుకునే అవకాశం ఏర్పడినట్లు చెప్పారు. ఎల్లారెడ్డిపేటలో విద్యాభ్యాసం చేసిన వేలాది మంది పూర్వ విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిద హోదాల్లో పని చేస్తున్నారని పేర్కోన్నారు. అందుకే గుర్తింపును సంతరించుకొన్న పాఠశాల భవణ పునఃనిర్మాణంనకు మంత్రి కెటిఆర్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆధునిక సౌకర్యాలతో తరగతి గదులు, ల్యాబులు, కంప్యూటర్ గదులు , మంచినీటి వసతులు, మూత్రశాలలు, మరుగు దొడ్లు , నిర్మించినట్లు తెలిపారు. క్రీడా మైదానం, ప్రహరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభ వేడుకలకు స్థానిక ప్రజలు, నాయకులు , దూర ప్రాంతాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలని కోరారు.

నైజాం కాలం నాటి పురాతన భవనాలను తొలగించినట్లు చెప్పారు. మన పిల్లల భవిష్యత్ కోసం నూతన భవణ సముదాయం ఎంతగానో తోడ్పాటును అందివ్వగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపిపి రేణు క కిషన్, జడ్పీటిసి లక్ష్మన్ రావు, ప్యాక్స్ చేర్మేన్ గుండారపు క్రిష్ణారెడ్డి ఎంపిటిసిలు పందిర్ల నాగ రాణి పరుశరాములుగౌడ్ , అనసూయ నర్సింహులు , స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News