Monday, December 23, 2024

మన ఊరు -మన బడితో పాఠశాలలకు మహర్ధశ

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : మన ఊరు మన బడితో పాఠశాలలకు మహర్థశ వచ్చిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పక్కన బాలుర ఉన్నత పాఠశాలలో రూ. కోటి నిధులతో చేపట్టనున్న అదనపు తరగతుల నిర్మాణం, డైనింగ్ హాల్, తదితర పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థుల ఉన్నతమైన చదువు కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించి పాఠశాలలో మౌళిక వసతులు, సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు.

అదే విధంగా బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి త్వరలోనే అన్ని రకాల సౌకర్యాలతో కొత్త భవనాలను నిర్మించి విద్యార్థినులకు చక్కగా చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా నిర్మిస్తున్న మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మెన్ ఎడ్ల నరసింహ గౌడ్‌తో కలిసి సందర్శించి పరిశీలించారు. భవన నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ ప్రతాప్ రెడ్డికి సూచించారు.

అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నూతన భవన నిర్మాణంలో భాగంగా కూలి పని చేస్తున్న మహిళలతో ముచ్చటిస్తూ గతంలో నేను కూడా కూలి బిడ్డనే అని కూలీలతో మమేకమై వారి సమస్యలతో పాటు జీవనశైలి విధానాన్ని అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చైర్మెన్ నరసింహ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మెన్ తులసి రామ్ నాయక్, కౌన్సిలర్‌లు, ప్రజా ప్రతినిధులు, కళాశాల లెక్చరర్లు, పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News