Monday, January 20, 2025

మన ఊరు మన బడి ద్వారా ఉన్నతంగా పాఠశాలలు

- Advertisement -
- Advertisement -

కందుకూరు: విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధిని సాధ్యం చేయడంలో పాఠశాలలు కీలకపాత్ర పోషిస్తాయని, పాఠశాలలో మౌలిక సధుపాయాలు, సౌకర్యాలు మరీంత కల్పించినట్లైతే అభ్యాస ఫలితాలు వృద్ధ్దిలోకి వచ్చి ఉన్నత ఆశయాలవైపు సాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కందుకూరు మండల పరిధిలోని నేదునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ లో అమెజాన్ సంస్థ స్వంత నిధులతో చేపిట్టిన ఆధునిక సౌకర్యాలను అమెజాన్ ఎడబ్య్లూఎస్ థింక్ స్పేసెస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా సౌత్ ఎషియా కమర్షియల్ బిజెనెస్ ప్రెసిడెంట్ పునీత్ చందోక్, జడ్పిచైర్ పర్సన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి, ఎంపిపి మంద జ్యోతిపాండు, జడ్పిటిసి బొక్క జంగారెడ్డి , సర్పంచ్ రామకృష్ణారెడ్డిలతో కలిసి శుక్రవారం మంత్రి ప్రార ంభించారు.

నేదునూరు పరిసర ప్రాంతాల నుండి విద్యనభ్యసించడానికి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యా ర్థులకు తరగతి గదులలో మంచి వెలుతురు వచ్చెలా లైట్లు ఏర్పాటు, వంట గది ,ఆట స్థలం, పారిశుద్ధ్ద సౌకర్యాలు, ఆధునిక క్యాంపస్‌తో విద్యార్థులు అభివృద్ధ్ది చెందడానికి పునర్నిర్మాణం చేశారు. విద్యార్థులు సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఆర్ట్ మ్యాథ్స్ వంటి సబ్‌జెక్టులలో ఆసక్తిని పెంచడానికి కృషిచేస్తున్నారు. పాఠశాలలో కొత్తగా ప్లోరింగ్ , క్రీడామైదానాలను మెరుగుపర్చడం, స్పోర్ట్‌కిట్, మధ్యాహ్న భోజనం చేయడానికి ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ లంచ్ షేడ్, వాటర్ ఫిల్టర్ వంటి సౌకర్యాలు అమెజాన్ వెబ్ సర్వీసెస్ కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా గ్రామాలలో అభివృద్ధ్దికి నోచుకోని పాఠశాలలను ఎంపిక చేసుకోని సకల హంగులతో పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధ్ది చెస్తుందన్నారు.

రాష్ట్రంలో 12 రకాల సౌకర్యాలతో 1 వెయ్యికి పైగా పాఠశాలలో యూనిఫాంతో పాటు పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలు తో పాటు అనేక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి విద్యారంగాన్ని ప్రైవేటు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ దేశాలలో తెలంగాణ విద్యార్థులు సత్తాచాటి ప్రపంచంతోనే పోటిపడేలా చేస్తున్నామన్నారు.

గత 9 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు 1200 గురుకుల పాఠశాలలో ఒక్కొ విద్యార్థిపై 1లక్ష20 వేలు ఖర్చుచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురసాని సురేందర్‌రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చంద్రశేఖర్, ఎంపిటిసి గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, డిఈ ఓ. సుశీందర్‌రావు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News